Keir Starmer: ట్రంప్ బెదిరింపులకు ‘డోంట్ కేర్’.. ఇరాన్ యుద్ధంలోకి నో ఎంట్రీ!
పశ్చిమాసియాలో (Middle East) రగులుతున్న యుద్ధ జ్వాలల సెగలు ప్రపంచ దేశాలకు పాకుతున్న వేళ.. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. హోర్ముజ్‌ను తిరిగి తెరిపించేందుకు త్వరలోనే ఒక భారీ ప్రపంచ స్థాయి దౌత్య సదస్సును (Global Summit) నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
ట్రంప్‌కు స్టార్మర్ కౌంటర్
హోర్ముజ్ జలసంధిపై సైనిక చర్యల విషయంలో తమతో కలిసిరాకపోతే, భవిష్యత్తులో బ్రిటన్‌కు అమెరికా ఎలాంటి సహాయం చేయబోదని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన తీవ్ర హెచ్చరికలపై స్టార్మర్ (Keir Starmer) ఘాటుగా స్పందించారు. “ఇది మా యుద్ధం కాదు. మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధంలోకి దిగబోము. మాపై ఎవరు ఎంతటి ఒత్తిడి తీసుకొచ్చినా సరే.. ఒక దేశ ప్రధానిగా బ్రిటన్ ప్రయోజనాల కోసమే నేను ఆలోచిస్తాను” అని ట్రంప్ బెదిరింపులను ఆయన సున్నితంగా తిప్పికొట్టారు. దౌత్యపరంగా అందుబాటులో ఉన్న ప్రతి శాంతియుత మార్గాన్ని పరిశీలిస్తామే తప్ప, విధ్వంసకర యుద్ధం తమ విధానం కాదని ఆయన కుండబద్దలు కొట్టారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అమెరికా కంటే ఐరోపానే ముఖ్యం
ప్రస్తుత పశ్చిమాసియా సంఘర్షణల వల్ల బ్రిటన్ (UK) భవిష్యత్తుపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడుతోందని ప్రధాని స్టార్మర్ (Keir Starmer) అంగీకరించారు. ముఖ్యంగా ఇరాన్ ఆంక్షలు, హోర్ముజ్ మూసివేత కారణంగా చమురు, ఇంధన సరఫరాకు (Fuel supply) తీవ్ర అంతరాయం కలుగుతోందని.. దీనివల్ల దేశంలో నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం (Cost of living) అమాంతం పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అయినప్పటికీ, ఈ ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బ్రిటన్ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, యుద్ధాన్ని ప్రేరేపించే అమెరికాతో బంధం కంటే.. తమకు భౌగోళికంగా, ఆర్థికంగా అండగా నిలిచే సహచర ఐరోపా దేశాలతో (European nations) బలమైన సంబంధాలు కొనసాగించడమే బ్రిటన్‌కు అన్ని విధాలా ప్రయోజనకరమని కీర్ స్టార్మర్ (Keir Starmer) తన భవిష్యత్ దౌత్య వైఖరిని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి








