Nepal Polls: నేపాల్లో సంచలనం.. ప్రధాని పీఠం వైపు బాలేంద్ర షా!
నేపాల్ దేశ రాజకీయాల్లో (Nepal Polls) సరికొత్త శకం మొదలైంది. యువత ప్రభంజనంతో దశాబ్దాలుగా పాతుకుపోయిన సంప్రదాయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో కుప్పకూలాయి. ప్రముఖ ర్యాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన 35 ఏళ్ల బాలేంద్ర షా (బాలెన్) నేతృత్వంలోని ‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ’ (RSP) సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి, సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల నేపాల్లో జరిగిన జెన్-జీ (Gen-Z) నిరసనల తర్వాత ప్రజలు తీవ్ర మార్పును కోరుకున్నారు. దీని ఫలితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (UML), నేపాలీ కాంగ్రెస్, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ (NCP) లాంటి లెగసీ పార్టీలను ప్రజలు తీవ్రంగా తిరస్కరించి, బాలెన్ నాయకత్వానికి పట్టం కట్టారు.
మాజీ ప్రధానిపై బాలెన్ విజయం..
ఝాపా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బాలేంద్ర షా (Balendra Shah).. సీపీఎన్ (యూఎంఎల్) అధినేత, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై ఏకంగా 50 వేల ఓట్ల భారీ మెజార్టీతో సంచలన విజయం (Nepal Polls) సాధించారు. ఓలీకి కేవలం 18,734 ఓట్లు రాగా.. బాలెన్కు ఏకంగా 68,348 ఓట్లు పోలయ్యాయి. దీంతో నేపాల్ తదుపరి ప్రధానిగా బాలెన్ పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
ఆర్ఎస్పీ (RSP): ఇప్పటికే 77 స్థానాల్లో గెలుపొంది, మరో 45 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో (Nepal Polls) కొనసాగుతోంది.
ఇతర పార్టీలు: నేపాలీ కాంగ్రెస్ 12 స్థానాలు నెగ్గగా, కమ్యూనిస్ట్ పార్టీలు సీపీఎన్ (యూఎంఎల్) 5, ఎన్సీపీ 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి.
ప్రచండ గెలుపు.. మోదీ శుభాకాంక్షలు..
సంప్రదాయ నేతలంతా (Nepal Polls) పరాజయం పాలవుతున్న వేళ.. ఎన్సీపీ కోఆర్డినేటర్, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ) మాత్రం తన పట్టు నిలుపుకున్నారు. రుకుమ్ ఈస్ట్-1 నియోజకవర్గంలో ఆయన సీపీఎన్ అభ్యర్థిపై 10,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సోమవారం నాటికి ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, నేపాల్లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఆయన ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి








