ఫ్లైదుబాయ్ ఘటన వెనక అల్ ఖైదా భావజాలం
ఫ్లై దుబాయ్ విమానంలో దాడి ఘటనకు పాల్పడిన కో పైలట్ హమామ్ అల్ హమ్మామీ.. గాజాలో పాలస్తీనియులపై ఇజ్రాయెల్ దాడులే తనను ఇలా ప్రేరేపించాయని తెలిపాడు.గాజా స్ట్రిప్ లో వేలాది మంది పాలస్తీనియుల మరణాలకు ప్రతీకారంగా ఈ విమానం కూల్చివేతకు ప్రయత్నించినట్లు హమామ్ స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ వార్తా సంస్థ ‘మాకో’ తెలిపింది.“గాజాకు ప్రతీకారంగా ఇలా చేశాను. అమరుడిగా చనిపోవాలనుకున్నాను” అని హమ్మామీ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.
హమ్మామీ గతంలో ఒమన్ జాతీయ విమానయాన సంస్థలో పనిచేసినట్లు సమాచారం. ఉగ్రవాద భావజాలంపై ఆందోళనల నేపథ్యంలో గతేడాది అతడిని సంస్థ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతడి పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాల్లో ఇజ్రాయెల్ విమానాలకు సంబంధించిన కాక్‌పిట్ వీడియోలు, అల్‌ఖైదా నేతల పోస్టులు కనిపించినట్లు సీఎన్ఎన్ తెలిపింది. హమ్మామీ తీవ్రవాద భావజాల ప్రభావానికి లోనై ఉండొచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో వ్యాఖ్యానించారు.
సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ 1073 విమానం దుబాయ్ నుంచి టెల్అవీవ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. విమానం ల్యాండింగ్‌కు గంటలోపే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై హమ్మామీ దాడి చేశాడు. ఆ సమయంలో విమానం కొన్ని సెకన్లలోనే 17 వేల అడుగులకు పైగా కిందికి పడిపోయినట్లు విమాన ట్రాకింగ్ సమాచారం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ దాడిని అడ్డుకున్నాడు. కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులకు లోపల జరుగుతున్న విషయం తెలిసింది. వారు కలిసి హమ్మామీని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న ఇద్దరు ఆఫ్‌డ్యూటీ పైలట్లు నియంత్రణ చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది.








