రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురితో బిజెపి కమిటీ, రేసులో లేని వెంకయ్య

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురితో బిజెపి కమిటీ, రేసులో లేని వెంకయ్య

13-06-2017

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురితో బిజెపి కమిటీ, రేసులో లేని వెంకయ్య

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం బిజెపి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ముగ్గురు కేంద్రమంత్రులకు చోటుదక్కింది. అయితే రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడు లేడని తేటతెల్లమైంది.

కొంతకాలంగా రాష్ట్రపతి అభ్యర్థి రేసులో వెంకయ్యనాయడు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు.అయితే బిజెపి తాజాగా ప్రకటించిన కమిటీలో వెంకయ్యకు చోటు దక్కడంతో ఆయన రాష్ట్రపతి పదవికి రేసులో లేడని తేటతెల్లమైంది.

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం బిజెపి ముగ్గురు మంత్రులతో కమిటిని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీలకు బిజెపి చోటు కల్పించింది.

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఈ ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం ఎన్ డి ఏ పక్షాలతో చర్చించనుంది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థిని ఎంపిక చేయనుంది.

ఎన్ డి ఏ పక్షాలతో చర్చించి త్వరగానే అభ్యర్థిని ప్రకటించాలని బిజెపి జాతీయ నాయకత్వం ఈ కమిటీకి సూచించింది. మరో వైపు ఎన్ డి ఏ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈ మేరకు ఎన్ డి యేతర పక్షాలు అభ్యర్థిని బరిలోకి దింపనున్నాయి.