ASBL NSL Infratech

రాశీ ఖ‌న్నాకు ఆఫ‌ర్ల వెల్లువ‌

రాశీ ఖ‌న్నాకు ఆఫ‌ర్ల వెల్లువ‌

గ‌త కొన్నాళ్లుగా స‌రైన హిట్ లేక కెరీర్లో ఇబ్బంది ప‌డుతున్న రాశీఖ‌న్నాకు ప్ర‌స్తుతం వ‌రుస అవ‌కాశాలొస్తున్నాయి. బాలీవుడ్ లో గ‌త నెల‌లో రిలీజైన యోధ సినిమా దారుణంగా ఫ్లాపైంది. దీంతో త‌న ఆశ‌ల‌న్నీ ఆగ‌స్ట్ 2న రిలీజ్ కానున్న వివాదాస్ప‌ద అంశాల‌తో తెర‌కెక్కిన ది స‌బ‌ర్మతి రిపోర్ట్ పైనే పెట్టుకుంది. దీనికంటే ముందుగా మే3న కోలీవుడ్ లో బాక్ (అరణ్మ‌యి 4) రిలీజ్ కానుంది. ఈ సినిమాకు మంచి బ‌జ్ కూడా ఉంది.

ఇవి కాకుండా తెలుగులో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తున్న తెలుసు క‌దా సినిమాలో ఓ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది రాశీ. మేధావి అనే మ‌రో త‌మిళ సినిమా నిర్మాణంలో ఉంది. ఇంకో బాలీవుడ్ సినిమా ప్ర‌తిపాద‌న ద‌శ‌లో ఉంది. ఇవ‌న్నీ చూస్తుంటే వీటిలో ఒక‌టి రెండు సినిమాలు హిట్ట‌యినా రాశీ కెరీర్ మ‌ళ్లీ ఊపందుకుని వ‌రుస ఆఫ‌ర్లు ద‌క్క‌డం ఖాయంలా క‌నిపిస్తుంది.

నితిన్ రాబిన్ హుడ్ నుంచి శ్రీల‌ల త‌ప్పుకున్నాక ఆ ప్లేస్ లోకి రాశీఖ‌న్నా వ‌చ్చింద‌ని టాక్. కొన్నేళ్ల కింద‌ట వ‌ర‌కు హిట్ల‌లో ఉండి ఇప్పుడిలాంటి గ్రాఫ్ చూడ‌టం కొంచెం ఇబ్బందే అయినా ఇన్నేసి ఆఫ‌ర్లు చేతిలో ఉండ‌టం విశేష‌మే. వెబ్ సిరీస్ రుద్రా, ఫ‌ర్జీల‌తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చిన రాశీ క‌థ‌లు బాగుంటే ఏ భాష‌లో అయినా న‌టిస్తాన‌ని చెప్తోంది. మ‌రి రాశీకి త‌ను కోరుకున్న బ్రేక్ ఎప్పుడొస్తుందో చూడాలి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :