ముంబై నగరంలో చిల్ అవుతున్న ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీరు చూస్తుంటే ముంబైవాలా లా అనిపిస్తుంది. ప్రస్తుతం వార్2 షూటింగ్ కోసం ముంబైలో ఉంటున్న ఎన్టీఆర్ డే మొత్తం షూటింగ్, నైట్ అయితే పార్టీలంటూ ముంబై లో చిల్ అవుతున్నాడు. రీసెంట్ గా తన భార్య ప్రణతితో కలిసి ఓ రెస్టారెంట్ లో కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత కరణ్ జోహార్ పార్టీలో కూడా ప్రత్యక్షమయ్యాడు.
అంతేకాదు తారక్ ముంబై కల్చర్ లో పూర్తిగా ఇమిడిపోయినట్లనిపిస్తుంది. అందుకే వార్2 టీమ్ తో కూడా అదే జోష్ తో కనిపిస్తున్నాడు. బాలీవుడ్ లో పార్టీ కల్చర్ ఎక్కువన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు ముంబై లో ఉంటున్న కారణంతో తారక్ కూడా అక్కడి కల్చర్ కు మౌల్డ్ అవాల్సిందే అన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో ఉన్నప్పుడు షూటింగ్ సెట్స్ లో లేదంటే ఇంట్లో ఉండే తారక్, తప్పని ఈవెంట్ ఉంటే తప్ప బయట కనిపించడు.
కానీ ఇప్పుడు మాత్రం ముంబై వీధుల్లో తెగ తిరిగేస్తున్నాడు. చూస్తుంటే తారక్ టాలీవుడ్ లో మిస్ అయిన ఫ్రీడమ్‌ను బాలీవుడ్ లో ఆస్వాదిస్తున్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు, అక్కడ సెలబ్రిటీలతో కూడా బాగా కలిసిపోతున్నాడు. వెనుక నుంచి కరణ్ ప్రోత్సాహం ఉండటంతో సెలబ్రిటీలు ఫ్రెండ్స్ అవడానికి పెద్ద టైమ్ పట్టదు. గతంలో చరణ్ కూడా బాలీవుడ్ లో సినిమా చేశాడు. కానీ చరణ్ మాత్రం ఇంత యాక్టివ్ గా కనిపించలేదు.