ASBL NSL Infratech

రాజ‌మౌళి కోసం దేనికైనా రెడీ అంటున్న మ‌హేష్

రాజ‌మౌళి కోసం దేనికైనా రెడీ అంటున్న మ‌హేష్

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తైంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లో టీమ్ బిజీగా ఉంది. ఇండియన్ సినిమా హిస్ట‌రీలోనే ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌నున్నాడు నిర్మాత కేఎల్ నారాయ‌ణ‌. ఇప్ప‌టికే ఈ సినిమాలో త‌న క్యారెక్ట‌ర్ కోసం మ‌హేష్ స్పెష‌ల్ కేర్ తీసుకుంటూ క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు.

ఇప్ప‌టికే లాంగ్ హెయిర్ తో క‌నిపిస్తున్న మ‌హేష్ లుక్స్ లో కూడా చాలా ఛేంజెస్ తీసుకురానున్నాడ‌ట‌. ప‌లు హాలీవుడ్ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్న ఈ సినిమా కోసం అంద‌రూ ఎంత‌గానో వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మామూలుగా మ‌హేష్ ప్ర‌తీ సినిమాకూ ముందో లేదంటే ఆఖ‌రిలోనో ఏదో వెకేష‌న్ కు వెళ్ల‌డం కామ‌న్. మ‌ధ్య‌లో షూటింగ్ కు గ్యాప్ వ‌చ్చినా వెంట‌నే ఫ్యామిలీ తో క‌లిసి ట్రిప్ కు వెళ్తుంటాడు మ‌హేష్.

అయితే రాజ‌మౌళితో సినిమా అంటే హీరోల‌కు ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందో చెప్ప‌డం క‌ష్టం. అందుకే మ‌హేష్, రాజ‌మౌళి సినిమా స్టార్ట్ అవ‌క‌ముందే ఫ్యామిలీతో క‌లిసి ఇప్ప‌టికే మూడు ట్రిప్పులేశాడు. రీసెంట్ గా మ‌రో ట్రిప్ వెళ్లాల‌నుకోగా స‌డెన్ గా దాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వ‌చ్చిందట‌. దానికి కార‌ణం రాజ‌మౌళినే. సినిమాకు సంబంధించి వ‌ర్క్ షాప్ స్టార్ట్ చేయాల్సి ఉంద‌ని చెప్ప‌డంతో మ‌హేష్ త‌న ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకున్నాడ‌ట‌. రాజ‌మౌళితో ప‌ని చేసే ఛాన్స్ అంద‌రికీ దొర‌క‌దు కాబ‌ట్టి మ‌హేష్ ఇలాంటివి ఎన్ని వ‌దులుకోవ‌డానికైనా సిద్ధ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :