వీరమల్లుతో జ్యోతికృష్ణ ప్రూవ్ చేసుకోవాల్సిందే!
రీసెంట్ గా హరిహర వీరమల్లు టీజర్ ను రిలీజ్ చేసి ఆ సినిమాకు ఇక నుంచి దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం పవన్ ఫ్యాన్స్ లో ఆందోళన కలిగించింది. ఎందుకంటే తన లాస్ట్ మూవీ రూల్స్ రంజన్ డిజాస్టర్ అయింది. అలా అని గతంలో కూడా జ్యోతి కృష్ణకు మంచి ట్రాక్ రికార్డేమీ లేదు.
గోపీచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ ఓ రేంజ్ లో డిజప్పాయింట్ చేయగా, నీ మనసు నాకు తెలుసు యావరేజ్ అనిపించింది. తమ్ముడు రవికృష్ణతో చేసిన కేడీ సినిమా అసలు వచ్చి పోయింది కూడా ఎవరికీ తెలియదు. ఇక తను నటించిన ఊలలలా కూడా డిజాస్టర్ సినిమానే. ఇవన్నీ చూసి పవన్ ఫ్యాన్స్ కంగారు పడటంలో న్యాయం లేకపోలేదు.
కాబట్టి జ్యోతికృష్ణ ఇప్పుడు వీరమల్లును ఓ ఛాలెంజ్ లా తీసుకుని హిట్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మొదటి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేశాడు. కొడుకు మీద ప్రేమ, నమ్మకంతో వీరమల్లు బాధ్యతను తనకు ఇచ్చి ఉండొచ్చు కానీ అందరికీ ఉన్న అనుమానాలను బద్దలు కొట్టాల్సిన అవసరం జ్యోతికృష్ణ మీద ఎంతైనా ఉంది. అంతే కాదు వీరమల్లు బ్లాక్ బస్టర్ అయితే ఆ సక్సెస్ లో కొంత షేర్ క్రిష్ కు ఇవ్వాల్సి వచ్చినా వ్యక్తిగతంగా జ్యోతికృష్ణ కెరీర్ కు ఆ సక్సెస్ చాలా బాగా ఉపయోగపడుతుంది.