ASBL NSL Infratech

బ‌ర్త్‌డే ట్రీట్ కోసం వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

బ‌ర్త్‌డే ట్రీట్ కోసం వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

టాలీవుడ్ స్టార్స్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా వారు న‌టిస్తున్న‌, న‌టించ‌బోయే సినిమాల‌కు సంబంధించిన అప్డేట్స్ లేదంటే త‌ర్వాతి సినిమాల డీటెయిల్స్ అనౌన్స్ చేయ‌డం ద్వారా మేక‌ర్స్ వారి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తూ ఉంటారు. ఈ మ‌ధ్య ఈ అప్డేట్స్ బాగా ఎక్కువ‌వుతున్నాయి. సినిమా అప్డేట్ లేనిదే హీరో బ‌ర్త్ డే కి కిక్ రావ‌డం లేదు. దీంతో ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఏదో అప్డేట్ ఇస్తున్నారు మేక‌ర్స్.

ఇదిలా ఉంటే మే 20న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్ డే వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా తార‌క్ న‌టిస్తున్న దేవ‌ర నుంచి అయితే ఫ్యాన్స్ కు క‌చ్ఛితంగా ఏదొక అప్డేట్ ఉండే ఛాన్సుంది. సినిమా కూడా అక్టోబ‌ర్ లోనే రిలీజ్ కాబ‌ట్టి ఏదొక స‌ర్‌ప్రైజ్ అయితే గ్యారెంటీ. ఇది కాకుండా తార‌క్ వార్2 సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

రీసెంట్ గా వార్2 షూటింగ్ లో జాయిన్ అయ్యాడు తార‌క్. ఇందులో తార‌క్ ఎలాంటి పాత్ర చేయ‌బోతున్నాడు? ఎలా క‌నిపించ‌బోతున్నాడ‌ని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వార్2 నుంచి ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఏమైనా ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారేమో అని ఫ్యాన్స్ ఆశ‌ప‌డుతున్నారు. మామూలుగా అయితే బాలీవుడ్ లో ఇలా బ‌ర్త్ డే కు అప్డేట్స్ ఇవ్వ‌డం లాంటి ఫార్మాలిటీ లేదు. కానీ తారక్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఫ‌స్ట్ లుక్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఇది కాకుండా ప్ర‌శాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా వ‌స్తుందంటున్నారు మ‌రి అదెంత‌వ‌ర‌కు నిజం అన్న‌ది చూడాలి.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :