ASBL NSL Infratech

ప్ర‌శాంత్ వ‌ర్మ జీవిత ల‌క్ష్య‌మ‌దే!

ప్ర‌శాంత్ వ‌ర్మ జీవిత ల‌క్ష్య‌మ‌దే!

హ‌నుమాన్ సినిమా రిలీజ్ కు ముందు ఆ సినిమా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న‌కు ఛాన్స్ వ‌ప్తే అవ‌తార్ లాంటి సినిమా తీస్తాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్తే అంద‌రూ అత‌నిది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు కానీ హ‌నుమాన్ రిజ‌ల్ట్ చూశాక ఎవ‌రూ నోరు మెద‌పలేక‌పోయారు. క‌ట్ చేస్తే హ‌నుమాన్ సినిమా దిగ్విజ‌యంగా వంద రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఘ‌నంగా శ‌త‌దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ మాట్లాడుతూ త‌న ఫ్యూచ‌ర్ ప్లాన్స్ ను చెప్పుకొచ్చాడు. మ‌రో 20 ఏళ్ల పాటూ ప్ర‌శాంత్ ఈ సినిమాటిక్ యూనివ‌ర్స్ మీద ప‌ని చేస్తాన‌ని, త‌న‌తో పాటూ ఇత‌ర డైరెక్ట‌ర్లు కూడా ఇందులో భాగ‌మ‌వుతార‌ని, సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు ఎంద‌రో స్టార్లు ఇందులో న‌టిస్తార‌ని చెప్పుకొచ్చాడు. అంటే ప్ర‌శాంత్ త‌న కెరీర్ మొత్తం ఈ సినిమాటిక్ యూనివ‌ర్స్ కే అంకితం చేయ‌బోతున్నాడ‌ని చెప్ప‌క‌నే చెప్పాడు.

ప్ర‌శాంత్ ద‌గ్గ‌ర ఎన్నో ఫాంట‌సీ స్టోరీలున్నాయి. త‌న ద‌గ్గ‌రున్న అధీరా కూడా ఆ జాన‌ర్ లోకే వ‌స్తుంది. ఇక జై హ‌నుమాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సో అంద‌రు సూప‌ర్ హీరోల‌ను ఒక తాటిపైకి తెచ్చి అవెంజ‌ర్స్ త‌ర‌హాలో టాలీవుడ్ లో ల్యాండ్ మార్క్ ఫ్రాంచైజ్ ఇవ్వాల‌నేది ప్ర‌శాంత్ లైఫ్ టైమ్ గోల్ గా అనిపిస్తోంది. క‌మ‌ర్షియ‌ల్ జాన‌ర్ ను ట‌చ్ చేయ‌కుండా సూప‌ర్ హీరోల‌తో ఇలాంటి సినిమాలు చేయ‌డమంటే చాలా రిస్క్ తో కూడుకున్న‌దే. ఎంత రిస్క్ అయినా ప‌ర్లేదంటున్నాడు ప్ర‌శాంత్.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :