ASBL NSL Infratech

భారత్‌లో 'వారసత్వ పన్నుచట్టం' అమలయ్యేనా..?

భారత్‌లో 'వారసత్వ పన్నుచట్టం' అమలయ్యేనా..?

అమెరికాలో వారసత్వ పన్ను చట్టం అమలులో ఉంది. దీని ప్రకారం.. ఆ దేశంలో ఎవరైనా 100 మిలియన్‌ డాలర్ల ఆస్తి సంపాదిస్తే.. అతడి మరణానంతరం ఆ ఆస్తిలో 55 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ వారసత్వ పన్ను విధానం.. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది. తాము అధికారంలోకి వస్తే భారత్‌లోనూ అమలు చేస్తామని కాంగ్రెస్‌ నాయకుడు, ఆ పార్టీ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ చైర్మన్, సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన శామ్‌ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇంతకూ ఈ వారసత్వ పన్ను అంటే ఏమిటి..?

వారసత్వ పన్ను..?

అమెరికాలో వారసత్వ పన్ను చట్టం అమలులో ఉంది. దీని ప్రకారం.. ఆ దేశంలో ఎవరైనా 100 మిలియన్‌ డాలర్ల ఆస్తి సంపాదిస్తే.. అతడి మరణానంతరం ఆ ఆస్తిలో 55 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. 45 శాతం మాత్రమే అతడి వారసులకు చెందుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన చట్టం. సంపాదించిన ఆస్తిలో సగానికిపైగా సమాజం కోసం వదులుకోవాలని ఈ చట్టం చెబుతుంది. సంపాదించిన వ్యక్తికే ఈ ఆస్తి మొత్తం చెందదు. అయితే ఇది అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతోంది.

ఇండియాలో అమలు సాధ్యమేనా?

ఇక శ్యామ్‌ పిట్రోడా చెప్పినట్టు వారసత్వ పన్ను భారత్‌లో అమలు చేయడం సాధ్యమవుతుందా.. అంటే కాదనే అంటున్నారు విశ్లేషకులు. ఆసక్తికర చట్టమే అయినా.. దీని అమలును అడ్డుకునేది మొదట రాజకీయ నాయకులే అని పేర్కొంటున్నారు. అలాంటి చట్టం అమలు చేస్తే మొదట నష్టపోయేది రాజకీయ నాయకులు, సంపన్నులే. పేద మధ్య తరగతి కుటుంబాలపైనా ప్రభావం ఉన్నప్పటికి అధిక మొత్తంలో సంపదను సమాజం కోసం వదులుకోవాల్సింది మాత్రం రాజకీయ నేతలు, ఆ పార్టీలకు విరాళాలు ఇచ్చే పారిశ్రామిక వేత్తలు, సంపన్నులు అవుతారు. ఇక సామాన్యులు, పేదలు ఈచట్టం కిందకు రారు. అయినా ఎన్నికల సమయం కాబట్టి, ఈ అంశాన్ని సైతం బీజేపీ .ఎన్నికలప్రచారాస్త్రం చేసేసింది. దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ పైకి సంధించింది.అంటే కాంగ్రెస్ చేజేతులారా.. తమ ప్రత్యర్థికి అవకాశాలు కల్పిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :