ASBL NSL Infratech

సోషల్ మీడియా సునామీలో కొట్టుకుపోతున్న ఓటు హక్కు..

సోషల్ మీడియా సునామీలో కొట్టుకుపోతున్న ఓటు హక్కు..

ఒకప్పుడు మనకు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలి అంటే నలుగురిని విచారించి.. దాన్ని మనం అనలైజ్ చేసి ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని కొంతమంది తమకు అనుకూలంగా ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రాలో ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణంలో సోషల్ మీడియా అనేది ప్రజల ఆలోచనలపై కీలకమైన ప్రభావాన్ని చూపిస్తోంది.మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా అయిన పత్రికలు, టీవీల కంటే కూడా ఈ సోషల్ మీడియా కి ప్రజలు ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్నారు. దీంతో కొంతమంది ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు కల్పించి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

సినిమాలలో హీరోకి ఎలివేషన్ ఇచ్చే పాటలను ఉపయోగించి వీడియోలు సృష్టించి రాజకీయ నాయకులకు ఎక్కడలేని హీరోయిజాన్ని అంట కడుతున్నారు. ఇది చూసే ప్రజలు కూడా వారి మాయలో పడిపోతున్నారు. మరి ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతృత్వంలో ఎల్లో మీడియా తనకు నచ్చిన వార్తలకు ఎక్కువ పబ్లిసిటీ ఇస్తోంది. నిజానికి 2014 ఎన్నికల సమయం నుంచి ఈ సోషల్ మీడియా ప్రచారం జోరు అందుకుంది. ఇప్పుడు రాబోయే ఎన్నికలకి ఇది మరింత విస్తృతంగా మారింది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న జనాభాలో 87% మంది న్యూస్ తెలుసుకోవడానికి న్యూస్ పేపర్లు, టీవీలకంటే కూడా సోషల్ మీడియా పై ఎక్కువ ఆధారపడుతున్నారు. కానీ ఈ పరిణామం మంచిది కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల నేపథ్యంలో ఎంతో విలువైన ఓటును.. ఎవరో చెప్పారనో.. నాయకులు వేసే డీజే సాంగ్ నచ్చిందనో వేయకండి.. ఎవరి పాలన మీకు మేలు చేసింది.. ఎవరు ఎక్కువ పథకాలు అమలు చేశారు.. మాట ఇచ్చి తప్పకుండా ఎవరు అన్ని హామీలు నెరవేర్చడానికి ప్రయత్నించారు.. అన్న విషయాన్ని ఆలోచించి మీ ఓటుని ఉపయోగించుకోండి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :