ASBL NSL Infratech

కుటుంబ రాజకీయాలకు నేను వ్యతిరేకిని..జగన్..

కుటుంబ రాజకీయాలకు నేను వ్యతిరేకిని..జగన్..

కుటుంబ రాజకీయాలకు తాను వ్యతిరేక అని జగన్మోహన్ రెడ్డి కుండల బద్దలు కొట్టి చెప్పారు. ఒక జనరేషన్ లో కేవలం ఒక్కళ్ళు మాత్రమే రాజకీయాలలో ఉండాలి తప్ప మొత్తం కుటుంబం రాజకీయాలని ఆక్రమించకూడదు అన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఆ కారణంతోటి తన చెల్లెలు వేరే రంగంలో ఎదగడానికి ప్రోత్సహించానని ఆయన చెప్పారు. ఓ ప్రాముఖ్యత చెందిన వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుటుంబ రాజకీయాలపై జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజకీయం అంటే ప్రజలతో మమేకమయ్య వ్యవహారం.. కుటుంబమంతా ఒకే పార్టీలో చేరితే మిగిలిన వాళ్లకు ఛాన్స్ ఎలా దక్కుతుంది? ప్రజలకు మేలు చేయడానికి సుదీర్ఘమైన భవిష్యత్తు ఉండాలి.. అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇక మా పార్టీ వారసత్వం గురించి అంటే.. జనరేషన్ కి ఒక్కళ్ళు మాత్రమే పార్టీ బాధ్యతలు మోస్తున్నారు. మిగిలిన వారు వారికి మద్దతుగా నిలబడతారు.. మా పార్టీలో మేము అవలంబిస్తున్న పద్ధతి ఇదే. ఇదే మాట నేను నా కుటుంబ సభ్యులకి చెప్పాను.. వారిని వేరే రంగాలలో కూడా ప్రోత్సహించాను. అంతేకానీ మొత్తం కుటుంబాన్ని రాజకీయానికి అంకితం చేయలేదు. రాజకీయాలలో చేరి కుటుంబ బాంధవ్యాలను నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. దీన్ని అడ్డుపెట్టుకొని కుటుంబాన్ని విడదీసే ప్రత్యర్ధులు ఎందరో ఉంటారు. ఇప్పుడు నేను నా చెల్లెలు విషయంలో అనుభవిస్తున్న బాధ అదే.. అని జగన్ తన మనసులోని బాధను వివరించారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :