ASBL NSL Infratech

సాహ‌సం చేయ‌నున్న కృతి

సాహ‌సం చేయ‌నున్న కృతి

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచ‌య‌మైన కృతి శెట్టి మొద‌టి సినిమాతోనే రూ.100 కోట్ల మార్క్ ను అందుకుని మంచి స‌క్సెస్ ను అందుకుంది. ఆ త‌ర్వాత రెండు సినిమాలు కూడా మంచి స‌క్సెస్ అవ‌డంతో కృతికి వ‌రుస ఛాన్సులొచ్చాయి. కానీ నాలుగో సినిమా నుంచి కృతికి వ‌రుస ఫ్లాపులు ఎదుర‌య్యాయి. ఫ్లాపుల్లో ఉండ‌టంతో కృతికి ఆఫ‌ర్లు కూడా తగ్గిపోయాయి.

ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ తో మ‌న‌మే సినిమా చేస్తున్న కృతి శెట్టి కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డాలంటే టాప్ గేర్ వేయాల్సిందేన‌ని ఫిక్సయిందట‌. ఈ నేప‌థ్యంలో రీసెంట్ గా ఫోటో షూట్స్ విష‌యంలో కూడా గ్లామ‌ర్ సైడ్ ఓపెన్ అవుతుంది. అంతేకాదు రొమాంటిక్ సినిమాల్లో న‌టించడానికి కూడా కృతి ఓకే అన‌బోతుంద‌ట‌. రీసెంట్ గా ఓ బోల్డ్ మూవీకి కృతి ఓకే చెప్పింద‌ని టాక్.

కంప్లీట్ రొమాంటిక్ ఎంట‌ర్టైనర్ గా రానున్న ఈ సినిమాకు ఓ యంగ్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ట‌. అంతేకాదు ఎప్పుడూ లేనిది లిప్ లాక్ కు కూడా కృతి ఓకే అనేసింద‌ట‌. గ్లామ‌ర్ సైడ్ రెచ్చిపోతే కృతికి అవ‌కాశాలొచ్చే ఛాన్సుంది. ఈ క్ర‌మంలోనే అమ్మ‌డు రొమాంటిక్ సినిమాకు సైన్ చేసిందంటున్నారు. అదే జ‌రిగితే మాత్రం కృతి కెరీర్ గాడిలో ప‌డ్డ‌ట్టేన‌ని చెప్పొచ్చు.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :