హైదరాబాద్ లో మూడో డేటా సెంటర్
డేటా సెంటర్స్ సంస్థ కంట్రోల్ఎస్ తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. భూకంపాలను తట్టుకునేలా 1.34 లక్షల ఎస్ఎఫ్టీలో కంపెనీ ఐదు అంతస్తులతో ఈ డేటా సెంటర్ భవనాన్ని నిర్మిస్తోంది. 2-3 నెలల్లో ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని తెలిపింది. సీస్మిక్ జోన్-2లో ఉండడంతో హైదరాబాద్ డిజాస్టర్ రికవరీ సేవల కంపెనీలకు ప్రధాన కేంద్రంగా మారుతోందని కంట్రోల్ఎస్ పేర్కొంది.
Tags :