ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కెనడా లో తాకా ఉగాది ఉత్సవాలు

కెనడా లో తాకా  ఉగాది ఉత్సవాలు

తాకా(TACA- Telugu Alliances of Canada) తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా ఆధ్వర్యంలో  తేది 13 ఏప్రిల్ 2024 శనివారం రోజున కెనడా దేశంలోని టోరొంటో పెవిలియన్ ఆడిటోరియంలో దాదాపు పదిహేనువందల మంది ప్రవాస తెలుగు వాసులు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ఉగాది పండుగ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.    

తాకా అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారు ప్రారంబించగా జనరల్ సెక్రెటరి శ్రీ ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి సభికులను ఆహ్వానించగా శ్రీమతి ధనలక్ష్మి మునుకుంట్ల, శ్రీమతి సాధన పన్నీరు, శ్రీమతి వాణి జయంతి, శ్రీమతి అనిత సజ్జ మరియు శ్రీమతి సుకృతి బాసని గారల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.    

కెనడా జాతీయ గీతం ఆలాపనతో సాయంత్రము ఐదు గంటలకు ప్రారంబమైన సాంస్కృతిక కార్యమ్రమాలు దాదాపు ఆరు గంటల పాటు నిరాఘాటంగా 150 కి పైన స్థానిక తెలుగు కుటుంబాల కళాకారులతో  కొనసాగాయి.   

ఉగాది పండుగ సందర్బంగా క్రోధి నామ సంవత్సర పంచాంగ శ్రవణం ప్రముఖ పురోహితులు శ్రీ మంజునాథ్ గారు సభికులందరికీ రాశి ఫలాలు తెలియచేశారు.

2024 సంవత్సరపు తాకా ఉగాది పురస్కారాలను ప్రముఖ డా||జగన్ మోహన్ రెడ్డి గరిస, ఒంటారియో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి దీపిక దామెర్ల మరియు కెనడాలో తెలుగు ప్రముఖులు శ్రీ లక్ష్మీనారాయణ సూరపనేని గారలకు అందచేసి ఘనంగా సత్కరించారు.     

ఈ ఉత్సవాలలో ప్రముఖ తెలంగాణా చిత్రకారులు డా||కొండపల్లి శేషగిరిరావు గారి శతజయంతి ఉత్సవాలలో బాగంగా “An Odyssey of Life and Art Dr Kondapalli Seshagiri Rao” పుస్తకాన్ని వారి బందు మిత్రులు శ్రీ విజయరామారావు గారు మరియు శ్రీ సుబ్బారావు గారి సమక్షంలో ఫౌండెషన్ కమీటీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లాయం గారు మరియు అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారు ఆవిష్కరించి డా||కొండపల్లి శేషగిరిరావు గారి జీవితం నేటి యువకులకు, విద్యార్థులకు ఆదర్శప్రాయమని తెలియచేశారు.     

తాకా వ్యవహారిక కార్యక్రమములో అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారు మాట్లాడుతూ తెలుగు కళలు, పండుగలు, భారతీయ సంసృతి సాంప్రదాయాలను కెనడాలోని తెలుగు వారందరూ కొనసాగిస్తూ ముందు తరాలకు అందజేయుటకు తాకా చేస్తున్న కృషిలో కెనడాలోని ప్రవాస తెలుగు వారందరూ పాల్గొన వలసినదిగా కోరారు. ఈ సందర్బంగా ఒంటారియో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి దీపిక దామెర్ల,డా||జగన్ మోహన్ రెడ్డి గరిస, శ్రీ లక్ష్మీనారాయణ సూరపనేని, ముఖ్య ఫౌండరు శ్రీ హనుమంతాచారి సామంతపుడి, జనరల్ సెక్రెటరి శ్రీ ప్రసన్నకుమార్ తిరుచిరాపల్లి, ఫౌండెషన్ కమీటీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లాయం సభికులనుద్దేసించి ప్రసంగించారు. 

ఈ పండుగ సంబరాలలో తాకావారు  పదిహేను రకాల వంటకాలతో ఏర్పాటుచేసిన రుచికరమైన తెలుగు భోజనం అందరూ ఆరగించి తాకా కమీటీ సభ్యుల కృషిని కొనియాడారు. 

అధక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారు మాట్లాడుతూ తాకా ఆశయాలను ముందుకు తీసుకువెల్లటం, తెలుగు జాతి కీర్తిని పెంచేందుకు తెలుగు వారందరినీ ఒకేవేదికపైకి తీసుకురావడం ముఖ్యం కాగా, అందు కోసం సహకరిస్తున్న గ్రాండ్ స్పాన్సర్ శ్రీరాం జిన్నాల గారికి, గోల్డు స్పాన్సర్లకు మరియు సిల్వర్ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ ఉగాది ఉత్సవాలలో అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులు శ్రీ రాఘవ్ అల్లం, జనరల్ సెక్రెటరి శ్రీ ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి, కోషాదికారి శ్రీ మల్లిఖార్జునా చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి అనిత సజ్జ, డైరక్టర్లు కుమారి విద్య భవణం, శ్రీ ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, ఖజిల్ మొహమ్మద్, దుర్గా ఆదిత్యవర్మ భూపతిరాజు, శ్రీ సాయి బోధ్ కట్టా,  యూత్ డైరక్టరు శ్రీమతి లిఖిత యార్లగడ్డ,  ఎక్స్ అఫిసియో సభ్యురాలు శ్రీమరి కల్పన మోటూరి, ఫౌండెషన్ కమీటీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీబోర్డు చైర్మన్ శ్రీ సురేశ్ కూన, ట్రస్టీలు శ్రీమతి శృతి ఏలూరి, శ్రీమతి వాణి జయంతి, శ్రీ పవన్ బాసని మరియు ఫౌండర్లు శ్రీ హనుమంతాచారి సామంతపుడి, శ్రీనాథ్ కుందూరి, మునాఫ్ అబ్దుల్ గారలు పాల్గొన్నారు.         

ఈ మొత్తం వేడుకలకు వ్యాఖ్యాతలుగా శ్రీమరి అనిత సజ్జ, కుమారి విద్య భవణం, ఖజిల్ మొహమ్మద్ మరియు శ్రీమతి లిఖిత యార్లగడ్డ గారలు వ్యవహరించారు. 

చివరగా కోషాధికారి శ్రీ మల్లిఖార్జునాచారి పదిర గారు, ఉగాది పండుగకు సహకరించిన స్పాన్సర్లు, దిజిటల్ స్క్రీన్ టీం, డీజే టీం, డెకోరేషన్ టీం, ఫ్రంట్ డెస్క్ టీం, వాలంటీర్లు, ఫుడ్ టీం మరియు వలంటీర్లను సమ్న్వయ పరచిన శ్రీ రాజ్ సజ్జ, శ్రీ గిరిధర్ మోటూరి, శ్రీ రాజేశ్ చిట్టినేని, టొరోంటో పెవిలియన్ యాజమాన్యానికి, ఆడియో వీడియో టీం లకు కృతజ్ఞతలు తెలుపుతూ వందన సంపర్పణ చేశారు.   

ఆఖరుగా భారత జాతీయ గీతాలాపనతో 2024 ఉగాది ఉత్సవాలు ముగిసాయి.    

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :