ASBL NSL Infratech

భారీగా ప్లాన్ చేస్తున్న త‌మ్ముడు

భారీగా ప్లాన్ చేస్తున్న త‌మ్ముడు

ప్ర‌స్తుతం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో రాబిన్ హుడ్ మూవీ చేస్తున్న నితిన్, మ‌రోవైపు వేణు శ్రీ రామ్ ద‌ర్శ‌కత్వంలో త‌మ్ముడు టైటిల్ తో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ కు అక్క‌గా అల‌నాటి హీరోయిన్ ల‌య న‌టిస్తోంది. త‌మ్ముడు సినిమాలో ఆమె పాత్ర‌కు చాలా ప్రాధాన్య‌త ఉంటుంద‌ని తెలుస్తోంది. త‌మ్ముడు మూవీలో యాక్ష‌న్ తో పాటూ సిస్ట‌ర్ సెంటిమెంట్ కూడా ఉంటుంద‌ట‌.

నితిన్ కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుంద‌ని అంద‌రూ అంటున్నారు. గ‌తంలో ఈ సినిమా నుంచి వ‌చ్చిన పోస్ట‌ర్ ను బ‌ట్టి చూస్తే సినిమాలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సీన్స్ ఉండ‌బోతున్నాయ‌ని అర్థ‌మ‌వుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లైంది. 10 రోజుల పాటూ జ‌ర‌గ‌నున్న ఈ భారీ షెడ్యూల్ కోసం స్పెష‌ల్ గా సెట్స్ వేసి మ‌రీ షూట్ చేస్తున్నార‌ట‌.

ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.8 కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఫైట్ లో మొత్తం 50 మంది ఫైట‌ర్స్ పాల్గొన‌నున్నార‌ట‌. అందుకే ప‌ర్ఫెక్ష‌న్ కోసం ఏకంగా 10 రోజులు ఈ ఎపిసోడ్‌ని వేణు శ్రీ రామ్ చిత్రీక‌రిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయ‌ని యూనిట్ వ‌ర్గాలంటున్నాయి. నితిన్ కెరీర్లోనే భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :