చీరాల కూటమి అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ సిద్దార్థ..
సినీ సెలబ్రిటీలకు రాజకీయాలకు మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. ఎన్నికల సమయంలో ఎందరో సినీ తారలు అభ్యర్థులకు మద్దతు పలుకుతూ ప్రచారం చేస్తారు.బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కోసం హీరో నిఖిల్ సిద్దార్థ ప్రచారం మొదలుపెట్టారు. గురువారం నాడు కొండయ్య చీరాల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ కి ముందు చీరాల మండల పరిధిలో ఉన్న హస్తినాపురంలోని గణేషుడి ఆలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న నిఖిల్.. కొండయ్యకు తన మద్దతు తెలియపరిచారు. ఈ సందర్భంగా హీరోతో ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. ఆయన కూడా ఎంతో ఉత్సాహంగా అభిమానులతో చేతులు కలిపి, సెల్ఫీలు దిగారు. ర్యాలీలో భాగంగా గడియార స్తంభం దగ్గర ఉన్న కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో నిఖిల్ ప్రసంగించారు. కూటమి పాలనలో చీరాల చిరునవ్వులమయం కావాలి అని అన్నారు. కొండయ్య ఒక ఓటు వేసి గెలిపించడం ద్వారా చీరాల అభివృద్ధి సాధ్యపడుతుందని నిఖిల్ ప్రస్తావించారు.