ASBL NSL Infratech

ఆంధ్ర రాజకీయాల ఎమోషన్.. ఎన్టీఆర్..

ఆంధ్ర రాజకీయాల ఎమోషన్.. ఎన్టీఆర్..

నందమూరి కుటుంబం నుంచి ఎందరో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. రాజకీయంగా కూడా ఆ కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం ఎలక్షన్స్ సమీపిస్తున్న నేపథ్యంలో మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం పై చర్చ నడుస్తుంది. అధికార పార్టీ , ప్రతిపక్షం తేడా లేకుండా జూనియర్ ఎన్టీఆర్ ని తమ ప్రచారంలో వాడేయడమే దీనికి ముఖ్య కారణం. జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు టీడీపీ తరఫున జోరుగా ప్రచారం సాగించారు. ఆ సమయంలో అందరూ ఆయనలో ఎన్టీఆర్ ఛాయ చూసి ఆశ్చర్యపోయారు. రాబోయే కాలంలో టీడీపీ నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ ను ఊహించుకున్నారు. కానీ ఆ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఎక్కడ తారక్ తన కొడుకుని దాటి వెళ్లిపోతాడో అని భావించిన చంద్రబాబు అతని పూర్తిగా పార్టీకి దూరం పెట్టేశారు.

టీడీపీ కార్యక్రమాల్లో జూనియర్ ఎంట్రీని ఆ పార్టీ అధినేత & కో ఇష్టపడడం లేదు అన్న వార్త ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది.. ఈ నేపథ్యంలో రాబోయే కాలానికి కాబోయే సీఎం అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకుని ఓ టిడిపి నేత తాజాగా ప్రచారం చేయడం వైరల్ గా మారింది. టీడీపీ నేత టీజీ భరత్ మాత్రం ధైర్యం చేసి జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ప్రచారం చేస్తున్నారు. ఇటు వైసీపీ లీడర్ .. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు కొడాలి నాని కూడా అతని ఫోటోలను ఉపయోగించి ప్రచారం కొనసాగిస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి వెళ్తున్న ర్యాలీలో ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో నాని హడావిడి చేశాడు. కొన్ని ఫోటోలలో సీనియర్ ఎన్టీఆర్ - జూనియర్ ఎన్టీఆర్.. మధ్యలో వైఎస్ జగన్ ను ఉంచి తనకు వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. మొత్తానికి పార్టీ ఏదైనా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఎన్టీఆర్ ఒక ఎమోషన్ గా గుర్తింపు పొందుతున్నాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :