ASBL NSL Infratech

ఆ విష‌యంలో గేమ్ ఛేంజ‌ర్ కు రూట్ క్లియ‌ర్

ఆ విష‌యంలో గేమ్ ఛేంజ‌ర్ కు రూట్ క్లియ‌ర్

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత అస్స‌లు లేట్ చేయ‌కుండా వెంట‌నే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో గేమ్ ఛేంజ‌ర్ మొద‌లుపెట్టాడు రామ్ చ‌ర‌ణ్. సినిమా అయితే మొద‌లుపెట్ట‌గ‌లిగాడు కానీ దాన్ని ఇప్ప‌టికీ పూర్తి చేయ‌లేదు చ‌ర‌ణ్. దానికి కార‌ణం శంక‌ర్ మ‌ధ్య‌లో ఇండియ‌న్2 సినిమాను కూడా డైరెక్ట్ చేయాల్సి రావ‌డం. దీంతో గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ బాగా లేట‌య్యింది.

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. రిలీజ్ అక్టోబ‌ర్ లో ఉంటుంద‌ని దిల్ రాజు చెప్ప‌డంతో చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈలోగా ఇండియ‌న్2 వాయిదా వార్త‌లు రావ‌డంతో గేమ్ ఛేంజ‌ర్ మ‌ళ్లీ వెన‌క్కి వెళ్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. క‌ల్కి జూన్ నెలాఖ‌రులో వ‌స్తున్న నేప‌థ్యంలో ఇండియ‌న్2 ను జులై 18న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ఆల్మోస్ట్ ఫిక్స‌య్యార‌ట‌.

ఇండియ‌న్2 రిలీజ్ మ‌రీ లేట‌వ‌ట్లేదు కాబ‌ట్టి ఆ ఎఫెక్ట్ గేమ్ ఛేంజ‌ర్ మీద ప‌డ‌న‌ట్లే అనుకోవ‌చ్చు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేసి తీరాల‌ని దిల్ రాజు చాలా ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. అక్టోబ‌ర్ లో మంచి రిలీజ్ డేట్ దొరికితే అక్టోబ‌ర్ లో లేదంటే డిసెంబ‌ర్ లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చూస్తున్నాడు. ఏదేమైనా ఈ ఏడాదిలోనే గేమ్ ఛేంజ‌ర్ ను రిలీజ్ చేయ‌డం ప‌క్కా అని యూనిట్ స‌భ్యులంటున్నారు.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :