ASBL NSL Infratech

‘‘తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం’’.. అమిత్ షా సంచలన హామీ

‘‘తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం’’.. అమిత్ షా సంచలన హామీ

తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఆ మేరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ అందిస్తామని అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాడు సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. ఈ మేరకు తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లపై మండిపడ్డారు. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లను తెచ్చింది కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలేనని, తాము ఈ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బడుగు-బలహీన వర్గాల ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ అమిత్ షా.. హస్తం పార్టీ తెలంగాణను ‘ఏటీఎం ఆఫ్ ఢిల్లీ’గా మార్చిందని, రాష్ట్రంలో అవినీతి సమస్యలను పరిష్కరించడంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని, అందుకే మందిరం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కేసులు వేసిందని విమర్శించిన అమిత్ షా.. ఆ కేసులన్నింటిలోనూ మోదీ గెలిచి రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారని, బాలరాముడిని ప్రతిష్ఠించారని వివరించారు. జమ్మూకాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసి.. 70 ఏండ్ల సమస్యను పరిష్కరించామని తెలిపారు. చివరిగా బీఅర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని, ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని ఆరోపించిన అమిత్ షా.. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. అందుకే ఎంపీగా రఘునందన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :