ASBL NSL Infratech

విజ‌య్- దాన‌య్య మూవీలో ఊహించ‌ని ట్విస్ట్

విజ‌య్- దాన‌య్య మూవీలో ఊహించ‌ని ట్విస్ట్

డీవీవీ దాన‌య్య నిర్మాత‌గా త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా సినిమా ఉంటుంద‌ని ఆ మ‌ధ్య చాలా వార్త‌లొచ్చాయి. ఈ సినిమా కు సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని, డీవీవీ దాన‌య్య ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌నున్నాడ‌ని అన్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల నుంచి మాత్రం విజ‌య్ డిమాండ్ చేసిన రెమ్యూన‌రేష‌న్ కు దాన‌య్య షాక్ అయ్యి, సినిమా నుంచి త‌ప్పుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

అయితే ఈ విష‌యంలో డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్ రీసెంట్ గా చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి. విజ‌య్ కోసం త‌న ద‌గ్గ‌ర క‌థ ఉన్న మాట నిజ‌మే కానీ ఇప్పుడున్న సిట్యుయేష‌న్స్ లో ఆ సినిమా సాధ్యం కాద‌ని, విజ‌య్ తో సినిమా లేద‌ని చాలా క్లియ‌ర్ గా చెప్పాడు. పైగా విజ‌య్ తో త‌న సినిమా అంటూ వచ్చిన వార్త‌ల‌న్నీ అవాస్త‌వాలే అని వెట్రిమార‌న్ క్లారిటీ ఇచ్చాడు.

దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దాన‌య్య బ్యాన‌ర్ లో విజ‌య్ సినిమా ఉంటుంద‌ని సంతోషించిన టాలీవుడ్ ప్రేక్ష‌కులంతా నిరాశ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్, వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో గోట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అవ‌బోతున్నాడు. రీసెంట్ గా రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేసిన విజ‌య్ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎల‌క్ష‌న్స్ టైమ్ లోపు పార్టీ నిర్మాణం పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :