అమరావతి నుంచి తరలించేందుకు కుట్ర

అమరావతి నుంచి తరలించేందుకు కుట్ర

22-08-2019

అమరావతి నుంచి తరలించేందుకు కుట్ర

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతి నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై స్పందించిన.. రాజధానిని మార్చేందుకు జగన్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ సాయం తీసుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ నోటి వెంట ఎప్పుడూ అమరావతి పేరే రాలేదని, ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా జగన్‌ వ్యవహారం ఉందని ఆరోపించారు. రాజధానికి నిధులు వద్దని ఢిల్లీలోనూ సీఎం చెప్పారని, గుంటూరు, కృష్ణా ప్రజలపై జగన్‌కు కక్ష ఎందుకని ప్రశ్నించారు. ఏపీలో ఓ కులాన్ని దెబ్బతీసేందుకు జగన్‌ ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.