ఆ ప్రచారంలో వాస్తవం లేదు : సీఎం రమేశ్

ఆ ప్రచారంలో వాస్తవం లేదు : సీఎం రమేశ్

15-06-2019

ఆ ప్రచారంలో వాస్తవం లేదు : సీఎం రమేశ్

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులెవరూ పార్టీ మారరని ఎంపీ సీఎం రమేశ్‌ సృష్టం చేశారు. పార్టీ మార్పులపై తమను ఎవరూ సంప్రదించలేదని, తాము కూడా ఎవర్నీ సంప్రదించలేదన్నారు. పార్టీ మారే అవసరం ఎవరికీ లేదని అన్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశం ముగిసిన అనంతరం సీఎం రమేశ్‌ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత కిశోర్‌ను నియమించుకున్నారంటూ జరగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని సీఎం రమేశ్‌ సృష్టం చేశారు.