కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసిన అనంతరం మీడియాతో ఏపీ సీఎం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసిన అనంతరం మీడియాతో ఏపీ సీఎం

14-06-2019

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసిన అనంతరం మీడియాతో ఏపీ సీఎం

– రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా అంశంతో పాటు, విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు.. అన్నీ హోం మంత్రి పరిధిలో ఉన్నాయి.
– వాటన్నింటికి సంబంధించి హోం మంత్రి అమిత్‌షాకు లేఖ కూడా ఇచ్చాం.
– రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతో ఉందని చెప్పాం.
– రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో సహాయ సహకారాలు కావాలని విజ్ఞప్తి చేశాం.
– రేపు నీతి ఆయోగ్‌ సమావేశం ఉంది. ఆ సమావేశం ప్రధాని ఆధ్వర్యంలో జరగబోతోంది.
– ఆ సమావేశంలో కూడా మా సమస్యలు ప్రస్తావిస్తాను. హోదా ఇవ్వాలని కోరుతాను.
– ఎప్పుడు, ఎక్కడ అవకాశం వచ్చినా హోదా కావాలని కోరుతూనే ఉంటాను. దేవుడి దయతో హోదా సాధించడానికి ప్రయత్నిస్తాను.
– ఇప్పుడే హోం మంత్రితో మాట్లాడాను. రాష్ట్రానికి హోదా ఇచ్చేలా ప్రధానిని ఒప్పించాలని ఆయనను కోరాను.
– వైయస్సార్‌సీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవిపై లేనిపోనివి ఊహించుకోకండి.
– మేము ఆ పదవి కోరలేదు. వారూ ఇస్తామని చెప్పలేదు.
– ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్చ జరగలేదు. కాబట్టి దానిపై మాట్లాడడం అనవసరం.