ఇవాంక పర్యటన అంతా రహస్యమే!

ఇవాంక పర్యటన అంతా రహస్యమే!

01-12-2017

ఇవాంక పర్యటన అంతా రహస్యమే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు ఇవాంక ట్రంప్‌ పర్యటన అంతా రహస్యంగానే జరిగింది. అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు ఆమె కదలికలపై చివరి క్షణంలోనే పోలీసులకు సమాచారమిచ్చారు. ముందుగా ఆమె ప్రత్యేక విమానంలో వస్తారని చెప్పారు. చివరికి సాధారణ ప్యాసెంజర్‌ విమానంలోనే వచ్చారు. వెస్టిన్‌ హోటల్లో బస చేస్తారని ముందు చెప్పారు. కానీ చివరికి ట్రైడెంట్‌కు మారింది. గోల్కొండ కోట సందర్శించే విషయాన్ని కూడా చివరి క్షణం దాకా గోప్యంగా ఉంచారు. ఆమెరికన్‌ సీక్రెట్‌ ఏజన్సీ భద్రతా వ్యూహాలకు అనుగుణంగా పోలీసులు కూడా ప్లాన్‌ ఎ, ప్లాన్‌ బి లు రూపొందించుకుని సిద్ధంగా ఉన్నారు. చివరి క్షణంలో ఏ మార్పులు జరిగినా, దానికి తగ్గట్లు స్పందించారు. అందుకే ఇవాంక పర్యటన ముగించుకుని వెళ్లిపోయే సందర్భంగా అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు డిజిపి మహేందర్‌ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించి వెళ్లారు.