ఇవాంక బృందంలో తెలంగాణ పారిశ్రామికవేత్త

ఇవాంక బృందంలో తెలంగాణ పారిశ్రామికవేత్త

27-11-2017

ఇవాంక బృందంలో తెలంగాణ పారిశ్రామికవేత్త

హైదరాబాద్‌ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ బృందంలో తెలంగాణ బిడ్డ రవి పులి ఉన్నారు. అమెరికా వర్జీనియాలో స్థిరపడ్డ రవి స్వగామ్రం ఉమ్మడి వరంగల్‌ జిల్లా (ఇప్పటి జయశంకర్‌ జిల్లా) తాడ్వాయి మండలం మారుమూల పల్లె కాటాపూర్‌. ఇంటర్నేషనల్‌ సొల్యూషన్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపక సీఈవో, ప్రెసిడెంట్‌. 1997లో అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఆయన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత సొంతంగా సంస్థలు నెలకొల్పే స్థాయికి ఎదిగారు. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే  ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. ఇవాంకా బృందంలో ఆయన కూడా ఉన్నారు.