భారత్ కు అమెరికా రాయబారిగా కెన్నత్ జస్టర్

భారత్ కు అమెరికా రాయబారిగా కెన్నత్ జస్టర్

02-09-2017

భారత్ కు అమెరికా రాయబారిగా కెన్నత్ జస్టర్

భారత్‌కు అమెరికా  రాయబారిగా కెన్నత్‌ జస్టర్‌ పేరును ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. జనవరి 20 నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవి భర్తీ కోసం జూన్‌లోనే వైట్‌హౌస్‌ సిఫారసు చేసినా ట్రంప్‌ ఈ రోజు ప్రకటించారు. సెనెట్‌ ఆమోదం తర్వాత భారత్‌కు రాయబారిగా వచ్చే అవకాశం ఉంది. 62 ఏళ్ల కెన్నెత్‌ ట్రంప్‌కు కీలక ఆర్థిక సలహాదారుడు, భారత వ్యవహారాల్లో ఆయనకు పట్టు ఉంది. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో అమెరికా అధ్యక్షుడికి డిప్యూటీ  అసిస్టెంట్‌గా, జాతీయ ఆర్థిక మండలిలో ఉప సంచాలకులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో అమెరికా రాయబారి పదవి ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఖాళీగా ఉంది.