నిమ్మకూరు శ్మశానవాటిక అభివృద్ధికి చర్యలు - జయరాం కోమటి

నిమ్మకూరు శ్మశానవాటిక అభివృద్ధికి చర్యలు - జయరాం కోమటి

03-08-2017

నిమ్మకూరు శ్మశానవాటిక అభివృద్ధికి చర్యలు - జయరాం కోమటి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌ దత్తత గ్రామమైన పామర్రు మండలం నిమ్మకూరులోని శ్మశానవాటిక అభివృద్ధికి గ్రామస్థుడు, ప్రవాసాంధ్రుడు కుదురవల్లి యశ్వంత్‌ సహకారం అందిస్తున్నారని ఉత్తర అమెరికా ప్రాంత ఏపీ ప్రతినిధి కోమటి జయరాం పేర్కొన్నారు.

నిమ్మకూరు శ్మశానవాటికను గ్రామీణ అభివృద్ధిశాఖ జాయింట్‌ కమిషనర్‌ వరప్రసాదరావుతో కలిసి ఆయన పరీశీలించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ యశ్వంత్‌ ఇచ్చిన రూ. 3 లక్షల విరాళంతోపాటు, ప్రభుత్వ నిధులు రూ.7 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. దహన సంస్కరణలకు షెడ్డూ నిర్మాణం, విశ్రాంతి గది, చుట్టూ ప్రహరీ నిర్మాణం, గేటు ఏర్పాటు, బోర్డు, మొక్కల పెంపకం పనులు చేయాల్సి ఉందన్నారు. వెంటనే పనులు ప్రారంభించి త్వరితగతిన పనులు పూర్తి చేయాడానికి చర్యలు చేపట్టామన్నారు. ఈ  సందర్భంగా గ్రామస్థులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కుదురవల్లి నాగేశ్వర రావు, నందమూరి శ్రీవేంకటేశ్వరరావు, సూరపనేని రంగబాబు, కాపవరపు నాగరాజు, చిగురుపాటి మురళి తదితరులు పాల్గొన్నారు.