అమెరికాను దాటేసిన భారత్‌

అమెరికాను దాటేసిన భారత్‌

25-01-2020

అమెరికాను దాటేసిన భారత్‌

స్మార్ట్‌ఫోన్‌ విపణిలో అగ్రరాజ్యం అమెరికాను దాటేసి భారత్‌ తొలిసారిగా రెండో స్థానానికి దూసుకెళ్లింది. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా అవతరించింది. ఈ మేరకు కౌంటర్‌పాయింట్‌ రీసర్చ్‌ తాజా నివేదికలో పేర్కొంది. 2019లో భారత్‌ 158 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 7శాతం ఎక్కువ. దీంతో ఈ జాబితాలో అమెరికా మూడో స్థానానికి పడిపోయింది. ఇక భారత స్మార్ట్‌ఫోన్‌ విపణిలో చైనా బ్రాండ్‌లు మరోసారి సత్తా చాటాయి. 2019లో అమ్ముడైన మొత్తం ఫోన్లలో చైనా బ్రాండ్‌ల వాటా రికార్డు స్థాయిలో 72 శాతానికి చేరింది. అంతుకుమందు ఏడాది ఇది 60 శాతంగా ఉండేది. చైనా దిగ్గజం షామీ 28 శాతం మార్కెట్‌ షేర్‌తో మరోసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తర్వాత శామ్‌సంగ్‌ 21శాతం, వివో 16శాతం, రియల్‌మీ 10శాతం, ఒప్పో 9 శాతం వాటా దక్కించుకున్నాయి.