అమెజాన్‌ చీఫ్‌ భారత్‌కు మరో గిఫ్ట్‌

అమెజాన్‌ చీఫ్‌ భారత్‌కు మరో గిఫ్ట్‌

21-01-2020

అమెజాన్‌ చీఫ్‌ భారత్‌కు మరో గిఫ్ట్‌

భారత్‌లో మూడు రోజుల పర్యటన అనంతరం అమెరికాకు చేరుకున్న ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోన్‌ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ వర్గాలు, చిన్న వ్యాపారుల నుంచి విమర్శలు ఎదురైనా భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించిన జెఫ్‌ బెజోస్‌ తాజాగా మరో గిఫ్ట్‌ అంటూ ట్వీట్‌ చేశారు. భారత్‌కు పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్‌ రిక్షాలను డెలివరీ చేస్తామని జెఫ్‌ బెజోస్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ట్వీట్‌తో పాటు పోస్ట్‌ చేసిన వీడియోలో ఈరిక్షాను నడుపుతూ జెఫ్‌ బెజోస్‌ కనిపించారు.