యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ గా జోయోల్‌ రిఫ్మాన్‌

యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ గా జోయోల్‌ రిఫ్మాన్‌

22-08-2019

యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ గా జోయోల్‌ రిఫ్మాన్‌

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌గా జోయోల్‌ రిఫ్మాన్‌ బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌గా పనిచేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. రిఫ్మాన్‌ బాధ్యతలు స్వీకరించినట్లు కాన్సులేట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. రిఫ్మాన్‌ గతంలో వాషింగ్టన్‌ డీసీ, అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌, పనామా, పాకిస్థాన్‌లలో వివిధ హోదాలో పనిచేశారు. స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరకముందు ఆయన అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ జడ్జిగా పనిచేశారు. మిషిగన్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో డిగ్రీ, సదరన్‌ మెథడిస్ట్‌ వర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందారు. ఇటీవలి వరకు కాన్సుల్‌ జనరల్‌గా ఉన్న కేథరిన్‌ హడ్డా మూడేళ్ల పదవీ కాలం పూర్తికావటంతో తిరిగి అమెరికా వెళ్లారు.

భారత్‌-అమెరికా బంధం పటిష్ఠమైంది

భారత్‌, అమెరికా బంధం పటిష్ఠమైందని అమెరికా కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయోల్‌ రిఫ్మాన్‌ అన్నారు. ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలతో బలమైన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలున్నాయని తెలిపారు. రెండు దేశాలమధ్య బంధాలను మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.