ఫైటర్‌ గా విజయ్‌ దేవరకొండ

ఫైటర్‌ గా విజయ్‌ దేవరకొండ

23-08-2019

ఫైటర్‌ గా విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పూరి నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి ఫైటర్‌ అనే పేరు ఖరారు చేశారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే కథ ఇదని తెలుస్తోంది. విజయ్‌ బాక్సర్‌గా కనిపిస్తారని సమాచారం. కథకు తగ్గట్టే ఫైటర్‌ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారన్నమాట. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. వచ్చే జనవరి నుంచి ఈ సినిమా సెట్సైపైకి వెళ్లనుంది. విజయ దేవర కొండలోని మరో కోణాన్ని పూరి ఈ చిత్రంతో ఆవిష్కరింబోతున్నారని చిత్రబృందం తెలిపింది. కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.