సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు?

సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు?

19-08-2019

సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు?

నాకు పెళ్లిపై ఎటువంటి నమ్మకం లేదుగాని సల్మాన్‌ఖాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్‌ నటి జరీన్‌ ఖాన్‌ బాంబు పేల్చారు. త్వరలోనే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ను తాను పెళ్లడబోతున్నానని షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. విషయం ఏంటంటే బాలీవుడ్‌ నటి జరీన్‌ ఖాన్‌ ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు ఆసక్తికరంగా పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో జరీన్‌కు విలేకరి ఓ ఆసక్తికర టెస్ట్‌ పెట్టారు. వైరల్‌ అయ్యే రూమర్‌ను మీపై మీరే సృష్టించుకోవాలని అన్నారు. దీనిపై జరీన్‌ స్పందిస్తూ ఇటీవల పెళ్లిళ్లు ఓ జోక్‌గా మారాయి. అందుకే నాకు వాటిపై నమ్మకం లేదు. కానీ సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అంటూ తనకు తానే షాకింగ్‌ రూమర్‌కు తెరలేపారు. జరీన్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసింది సల్మాన్‌ ఖానే. వీర్దిదరూ వీర్‌ చిత్రంలో నటించారు.