ఫలక్‌నుమాలో ఇవాంకా డిన్నర్‌

ఫలక్‌నుమాలో ఇవాంకా డిన్నర్‌

06-11-2017

ఫలక్‌నుమాలో ఇవాంకా డిన్నర్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ నగరానికి రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పకడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది. చారిత్రాత్మకమైన ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో ఆమె ఒకరోజు బస చేయడంతో పాటు అక్కడే అల్పాహార విందు, డిన్నర్‌ చేయనున్నారు. సెవెన్‌ స్టార్‌ హోటల్‌గా రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్‌లో ఇవాంకా అడుగుపెడుతున్నందున ఇప్పటి నుంచే భద్రతా చర్యలపై దృష్టి కేంద్రీకరించారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఇవాంకా ట్రంప్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ పోలీస్‌ ఇంటలిజెన్స్‌ విభాగం అధికారులు, అమెరికాకు చెందిన సీక్రెట్‌ సర్వీస్‌ బృందాలు సంయుక్తంగా భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. నగరంలో జరుగనున్న గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఇవాంకా ఇక్కడికి వస్తున్నారు. పర్యటన ముగిసేంత వరకూ ఆమె మాదాపూర్‌లో రహేజా మైండ్‌స్పేస్‌లో బస చేసేందుకు ప్రొటొకాల్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం ఇవాంకా భద్రత కోసం 500 మంది పోలీసులను నియమిస్తున్నారు.