హైకోర్టు సంచలన తీర్పు

హైకోర్టు సంచలన తీర్పు

20-08-2019

హైకోర్టు సంచలన తీర్పు

విధుల్లో అలసత్యం ప్రదర్శించిన అధికారులపై రాష్ట్ర హైకోర్టు కొరడా ఝళిపించింది. మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిన గజ్వేల్‌ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి, తొగుట తహసీల్దార్‌ ప్రభుకు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరికీ జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా, విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ తీర్పు నిచ్చింది. మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలో తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడంతో తమకు న్యాయం జరగలేదని బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. నిర్వాసితుల పిటిషన్‌ విచారించిన హైకోర్టు అధికారులకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.