అట్లాంటాలో ఏప్రిల్ 18న ‘టీటీఏ’ బోర్డు సమావేశం
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA ) తన సంస్థాగత బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా అట్లాంటాలో వ్యూహాత్మక బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది. ఏప్రిల్ 18, 2026 (శనివారం)రోజు అట్లాంటాలోని హిల్టన్ అల్ఫారెట్టా హోటల్లో ఈ సమావేశం అట్టహాసంగా జరగబోతోంది.
టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది నేతృత్వంలో జరగనున్న ఈ భేటీకి ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వైజరీ కౌన్సిల్, రీజినల్ లీడర్షిప్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. తెలుగు కమ్యూనిటీ కోసం చేపట్టబోయే రాబోయే సేవా కార్యక్రమాలు, సంస్థ భవిష్యత్ ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి
కార్యక్రమంలోని అంశాలు:
- వేదిక: హిల్టన్ అల్ఫారెట్టా అట్లాంటా (Hilton Alpharetta Atlanta).
- సమయం: ఏప్రిల్ 18 ఉదయం 9:00 గంటల నుండి (EST).
టీటీఏ మెగా కన్వెన్షన్: జూలై 17-19, 2026 వరకు నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో జరగనున్న ‘టీటీఏ మెగా కన్వెన్షన్ – 2026’ ఏర్పాట్లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.
నాయకత్వ బృందం..
ఈ సమావేశంలో టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ వీరమనేని, జనరల్ సెక్రటరీ శివ రెడ్డి కొల్లా, ట్రెజరర్ సహోదర్ పెద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవితా రెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల పాల్గొననున్నారు.
అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి, డాక్టర్ విజయపాల్ రెడ్డి, డాక్టర్ మోహన్ రెడ్డి పటలోళ్ల, భరత్ రెడ్డి మదాడి, శ్రీని అనుగుల సమక్షంలో ఈ వ్యూహాత్మక సమావేశం జరగనుంది. టీటీఏను మరింత పటిష్టం చేసే దిశగా ఈ సమావేశం ఒక కీలక మైలురాయిగా నిలవనుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








