వీసా నిబంధనలపై మే 3న TASA అవగాహన సదస్సు
TASA: శాన్ ఆంటోనియోలోని తెలుగు వారందరికీ ఇమ్మిగ్రేషన్ , వీసా నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ‘శాన్ ఆంటోనియో తెలుగు సంఘం’ (TASA) ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మే 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:00 నుండి 5:00 గంటల వరకు ‘లున్నా ఈవెంట్ సెంటర్’లో ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఉమా మంత్రవాడి పాల్గొని, తాజా వీసా విధానాలపై కీలక సమాచారాన్ని అందిస్తారు.
చర్చలోని అంశాలు..
ఈ సదస్సులో ప్రధానంగా క్రింది అంశాలపై చర్చించనున్నారు.
- H1-B ఫైలింగ్ ప్రక్రియ , నిబంధనలు.
- H4 నుండి F1 మార్పు, STEM OPT , CPT నియమాలు.
- EB2 , EB5 గ్రీన్ కార్డ్ అప్డేట్స్.
- అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీలో వచ్చిన తాజా మార్పులు.
కార్యక్రమ వివరాలు..
సదస్సు అనంతరం అటార్నీతో నేరుగా మాట్లాడేందుకు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ‘ప్రశ్నోత్తరాల సమయం’ (Q&A) ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రవేశం పూర్తిగా ఉచితం. ఆసక్తి కలిగిన వారు తమ ప్రశ్నలను ముందుగానే ఆన్లైన్ ఫారమ్ ద్వారా సమర్పించవచ్చు.
సంప్రదించాల్సింది..
కార్యక్రమ వివరాల కోసం ఆది నారాయణ (919-916-0919), నీరజ సుంకర (210-827-1881), లేదా నూతన్ ఎల్లంకి (832-721-9440)లను సంప్రదించాలని TASA కార్యవర్గ సభ్యులు (TASA EC) కోరారు. ఇమ్మిగ్రేషన్ సందేహాలు ఉన్న తెలుగు వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి








