ఘనంగా టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు
టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు 2026 విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమం రాధాకష్ణ దేవాలయంలో ఆదివారం, ఏప్రిల్ 5, 2026న మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 7:30 వరకు జరిగింది. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో తెలుగు కుటుంబాలు హాజరై పండుగను ఆనందంగా జరుపుకున్నారు. కార్యక్రమం సంప్రదాయ పూజలతో ప్రారంభమై, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, పానకం వంటి ఆచారాలతో కొనసాగింది. కార్యక్రమం 2026 సాంస్కృతిక చైర్ అనిత వేమిరెడ్డి స్వాగత సందేశంతో ప్రారంభమైంది. అనంతరం నాన్-స్టాప్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. పాంపరాగత ఉగాది విశేషాలను ప్రతిబింబిస్తూ పంచాంగ శ్రవణం, తెలుగు పద్య పోటీలు నిర్వహించబడ్డాయి. టాంటెక్స్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి తన సందేశంలో సంస్థ అభివృద్ధి, భవిష్యత్ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలు ప్రదానం చేసి ప్రతిభావంతులను సత్కరించారు. ప్రత్యేక ఆకర్షణగా లైవ్ బ్యాండ్ “రీవైవల” సంగీత ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా, అనిరుధ్ సుస్వరం, మనోఙ బెల్లంకొండ వంటి ప్రతిభావంతులైన కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.
కార్యక్రమానికి యాంకర్లుగా మధురిమ వొద్నాల, రాధా పెటారు వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరి వంటి అంశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. కుటుంబ సమేతంగా వచ్చిన వారు పండుగను ఆనందంగా జరుపుకుంటూ తెలుగు సంప్రదాయాలను స్మరించుకున్నారు. టాంటెక్స్ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే జాతీయ సంస్థలకు గుర్తింపునిచ్చి, స్పాన్సర్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ ఉత్సవం ద్వారా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను యువతకు పరిచయం చేయడం లక్ష్యంగా ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
చివరిగా, ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ టాంటెక్స్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. చివరగా ఈవెంట్ కోఆర్డినేటర్ అర్పితారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అందరూ కలిసి భారత జాతీయ గీతాన్ని ఆలపించడంతో ముగిసింది. ఈ ఉత్సవం ద్వారా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఐక్యతను టాంటెక్స్ మరోసారి చాటిచెప్పింది.








