షార్లెట్‌లో తానా మదర్స్ డే సంబరాలు.. మే 16న గ్రాండ్ ఈవెంట్!
TANA: షార్లెట్‌లో మే 16వ తేదీన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో ‘మదర్స్ డే‘ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమం, స్థానిక తెలుగు మహిళలకు ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోనుంది.
అతిథులుగా ..
ఈ వేడుకలో ‘అందెల రవమిది’ ఫేమ్ శ్రీమతి ఇంద్రాణి దావలూరి విశిష్ట అతిథిగా పాల్గొనబోతున్నారు. వారితో పాటు తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ స్నిగ్ధ ఏలేశ్వరపు తన గాత్రంతో అలరించనుండగా, ప్రముఖ నటి, యాంకర్ స్రవంతి ప్రత్తిపాటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
అద్భుతమైన స్పందన..
మే 16, శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 5533 Westpark Dr లో జరిగే ఈ ఈవెంట్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విఐపి (VIP) టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయని నిర్వాహకులు ప్రకటించారు. ప్రస్తుతం 50 డాలర్ల ధర కలిగిన రెగ్యులర్ టికెట్లు మాత్రమే పరిమితంగా అందుబాటులో ఉన్నాయి.
వినోదం, విందు..
ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత విభావరితో పాటు షాపింగ్ స్టాల్స్, రాఫిల్ ప్రైజెస్, ఆసక్తికరమైన ఆటలను ఏర్పాటు చేశారు. హాజరైన వారందరికీ రుచికరమైన విందు భోజనం వడ్డించనున్నారు.
నిర్వాహక బృందం..
తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీనివాస్ లావు మార్గదర్శకత్వంలో.. తానా అప్పలాచియన్ రీజినల్ రిప్రజెంటేటివ్ రవి (నాని) వడ్లమూడి, మధురి యలూరి, ఠాగూర్ మల్లినేని, నాగ పంచమర్తి, కిరణ్ కొత్తపల్లి, చందు గొర్రెపాటి తదితర ప్రతినిధులు ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గ్రూప్ రిజర్వేషన్ల కోసం (980) 322-5177 నంబర్లో మధురి యలూరిని సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి








