మే 2న TAGDV ఉగాది సంబరాలు.. ప్రత్యేకంగా ఉచిత నోటరీ సదుపాయం
TAGDV: గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం (TAGDV) తన 53 ఏళ్ళ సేవా ప్రస్థానంలో భాగంగా సమాజ సేవకు పునరంకితమవుతోంది. మే 2వ తేదీన నిర్వహించనున్న “శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాల” సందర్భంగా భక్తులు , సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఉచిత నోటరీ సేవలను (FREE Notary Services) అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
కార్యక్రమ వివరాలు..
- తేదీ: మే 2, 2026 (శనివారం)
- సమయం: మధ్యాహ్నం 2:00 గంటల నుండి
- వేదిక: Downingtown High School East, 50 Devon Drive, Exton, PA, 19341.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలనుకునే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఆసక్తి ఉన్నవారు tagdv.com/notary-signup వెబ్సైట్ ద్వారా లేదా ఫ్లయర్లోని క్యూఆర్ (QR) కోడ్ను స్కాన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరడమైనది.
సంప్రదించాల్సింది..
మరింత సమాచారం కోసం లావా కుమార్ ఇనాంపూడి (267-371-2909) లేదా విజయ భాస్కర్ మక్కెన (732-662-0196)లను సంప్రదించవచ్చు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రెసిడెంట్ తులసి రామ్ మోహన్ రావు తాళ్లూరి, వైస్ ప్రెసిడెంట్ హరీష్ అన్నబత్తిన, సెక్రటరీ సురేష్ బొండుగూల, ట్రెజరర్ మధు బూదటి, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్ చుండూరి, జాయింట్ ట్రెజరర్ శివ అనంతున, మరియు కార్యవర్గ సభ్యులు కోరుతున్నారు.






