న్యూయార్క్లో తానా ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం విశేష భక్త జన సందోహంతో వైభవంగా నిర్వహణ: తానా న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు
హిక్స్విల్లే, న్యూయార్క్, జూన్ 6, 2026:
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి గారి మార్గదర్శకత్వంలో, తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో జూన్ 6, 2026 శనివారం హిక్స్విల్లేలోని అసామై హిందూ టెంపుల్లో నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం విశేష భక్త జన సందోహంతో అత్యంత వైభవంగా జరిగినట్లు తానా న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు(Srinivas Bharthavarapu), ఈవెంట్ కోఆర్డినేటర్ ప్రసాద్ కోయి(Prasad Koyi), సుచరిత అనంతనేని(Sucharitha ananthaneni), రజిత కల్లూరి(Rajitha Kalluri) తెలిపారు.
ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సుమారు 500 మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో సాగింది.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో, ప్రముఖ ఆగమ పండితులు శ్రీ వెంకటాచార్యులు (పిట్స్బర్గ్ హెడ్ ప్రీస్ట్), ప్రముఖ వేద పండితులు శ్రీ హనుమంతరావు గార్ల ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సంప్రదాయ విధానంలో ఈ పవిత్ర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి(Ravi Potluri), కోశాధికారి రాజా కసుకుర్తి(Raja Kasukurti), మిడ్-అట్లాంటిక్ రీజినల్ కోఆర్డినేటర్ ఫణి కంతేటి(Phani Kantheti), న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ నారెపలేపు(Sudheer Narepalepu), యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి(Srinivas Cherukuri), ఫౌండేషన్ కోశాధికారి శ్రీనివాస్ ఓరుగంటి(Srinivas Oruganti), ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేక(Satish Meka), దశరథ్ తలపనేని (Dasaradh Talapaneni) తదితరులు హాజరై కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు.
ఈ సందర్భంగా రవి పొట్లూరి మాట్లాడుతూ, న్యూయార్క్లో ఇంత వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం ఆనందదాయకమని, తానా చరిత్రలో ఇది ఒక విశిష్టమైన కార్యక్రమంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీనివాస్ భర్తవరపు, ప్రసాద్ కోయి మరియు న్యూయార్క్ టీమ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ మహోత్సవానికి భక్తుల నుండి లభించిన విశేష స్పందన, రిజిస్ట్రేషన్లు మరియు ఆర్థిక సహకారం అందించిన దాతలకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నమోదు చేసుకోలేకపోయిన భక్తులు కూడా స్వామివారి దర్శనం, ఆశీర్వాదాలు మరియు ప్రసాదం స్వీకరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణతో పాటు కమ్యూనిటీ బలోపేతమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని శ్రీనివాస్ భర్తవరపు తెలిపారు.
ఈ కార్యక్రమ ఏర్పాట్లను సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించిన న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు, ప్రసాద్ కోయి ని తానా లీడర్షిప్ విశేషంగా కొనియాడారు.
అలాగే న్యూయార్క్ టీమ్ సభ్యులు దిలీప్ ముసునూరు, శ్రీనివాస్ నాదెళ్ల, జితేంద్ర యార్లగడ్డ, ఉమా పోలిరెడ్డి, శ్రీనివాస్ పలాటి, ప్రదీప్ అరవేటి, రాజేష్ కడియాల, సునీల్ చల్లగుళ్ల, రవీంద్ర ఉప్పాల, సురేష్ మల్నీడి, కృష్ణకిషోర్ జమ్ముల, శ్రీహరి పర్ణ, కలీం మహమ్మద్, రాఘవేంద్ర మాదాల, విజయ్ కుమార్ లావు తదితరులు కార్యక్రమ విజయానికి విశేష కృషి చేశారు.
తానా వాలంటీర్లు ఆశ్రిత కోయి, సమన్విత మిన్నెకంటి, గీతికా చల్ల, వరుణ్ భర్తవరపు, శరణ్ భర్తవరపు, రజిత్ రెడ్డి, రమ్య రెడ్డి, శ్రీప్రియా శ్రీధర్, కావ్య మల్లేపల్లి, మజ్జి తులసీలక్ష్మి, శాన్వి కంకణాల, అందించిన సేవలు కార్యక్రమ విజయానికి ముఖ్య కారణమయ్యాయి.
ప్రత్యేకంగా దైవ భక్తి గీతాలు ఆలపించిన ఆశ్రిత కోయి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
స్పెషల్ గెస్ట్ టౌన్ అఫ్ నార్త్ హేంప్స్టీడ్ (Town Of North Hempstead) Town Clerk, Ragini Srivastava గారు తానా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసి తానా చేసే సేవలను కొనియాడారు.
ఈ మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించడంలో సహకరించిన భక్తులందరికీ తానా న్యూయార్క్ టీమ్ తరఫున న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.








