జెండా పండుగ – అన్నదానం – నృత్యార్చనతో ఘనంగా అలరించిన అన్నమయ్యపురం
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈ శనివారం ఉదయం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని దేశ భక్తి శ్రద్ధలతో నిర్వహించగా, మధ్యాహ్నం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం నటరాజ నృత్య నికేతన్ ఆధ్వర్యంలో నృత్యార్చన కార్యక్రమం భక్తిమయ వాతావరణంలో ఘనంగా జరిగింది.
సాయంత్రం కార్యక్రమం తొలుత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతితో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.
అనంతరం నటరాజ నృత్య నికేతన్‌కు చెందిన శిష్యులు సారా తిలక్, అక్షయ ఎన్., రిత్విక బాలివాడ, నివేదా పొనుగోటి, జి. మానస్వి, జి. గాయత్రి రెడ్డి, శ్రీష్ణిత రెడ్డి, భువిక వల్లూరి, వి. శ్రీలలిత, ఎం. హర్షిత, దూతి శ్రీ పాలడుగు, మిరియాల నామస్వి సాయి, అదితి సంహిత, సుహాన్వి ఎస్., శ్రీహిత చంద్రశేఖర్, ఎస్. అన్విత, కాంశిక, పి. సాధ్విక, సాయి అన్విత నాదింపల్లి, సాయి చైత్ర నాదింపల్లి, ఎ. జోషిత, రిషిక, నామస్వి జోస్యుల, శరణ్య శ్రీజ, రావూరి దాక్షిణ్య, కోమల్ సాయి కుకుట్ల, బి. వంశిక, ప్రణమ్య రెడ్డి (నైనీ), ఒడూరి ప్రభా వర్ణిక, తన్వి ఎం., సంజన గాజుల, శ్రీ త్వారిత వేముల, ఎ. రిషి శ్రీ, పెయ్యాల చెర్వితవల్లి, ఎం.ఎల్. స్నేహారెడ్డి, వి. వెంకట హన్విక, తన్వి గణేశుని, యోక్షిత శ్రీ యరగోగు, జాహ్నవి ప్రియ తదితరులు సమిష్టిగా “మహా గణపతిం, తిరు తిరు జవరాల, నారాయణతే నమో నమో, ఏతడే రఘురాముడు, అదివో అల్లదివో, బ్రహ్మాంజలి, బృందావన నిలయే, కొండలలో నెలకొన్న, తందనానా అహి” వంటి భక్తిరసభరితమైన సంకీర్తనలకు నృత్యాన్ని ప్రదర్శించి శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి కూచిపూడి నృత్య కైంకర్యం సమర్పించారు.
శిష్యులు లయ, తాళం, భావాభినయం, హస్తముద్రల సమన్వయంతో ప్రదర్శించిన నృత్యరూపకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుని అన్నమయ్యపురాన్ని భక్తిరసంతో నింపాయి.
ఈ సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని పక్షాన కళాకారులను అభినందించి, అన్నమయ్య సంకీర్తనలను నృత్యరూపంలో భక్తులకు చేరువ చేస్తున్న నటరాజ నృత్య నికేతన్ గురువులను ప్రశంసించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ముగించారు.








