ఎంఐఎం నేతలారా.. దమ్ముంటే అడ్డుకోండి : బండి సంజయ్
పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం (Bhagyalakshmi Temple) వద్ద లక్షలాది మందితో సామూహిక వందేమాతరం (Vande Mataram) గీతాలాపన చేయిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఎంఐఎం నేతలారా దమ్ముంటే అడ్డుకోండని సవాల్ విసిరారు. వందేమాతరం గీతాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా తప్పదన్నారు. చట్ట ప్రకారం వ్యవహరించే తమను మతతత్వవాదులంటారా అని మండిపడ్డారు. స్మార్ట్ రేషన్ కార్డులపై సీఎం (CM), మంత్రులు (Ministers) ఫొటోలు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయేదని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో సిద్ధరామయ్య హయాంలో రూ.వందల కొట్లలో తయారు చేసిన స్మార్ట్ కార్డులన్నీ నిరుపయోగమయ్యాయని గుర్తు చేశారు. తెలంగాణలో దాదాపు 2 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తోందన్నారు. రేషన్ కార్డులపై మోదీ (Modi) ఫొటో ఎందుకు పెట్టడం లేదో చెప్పాలన్నారు. కేంద్రం ఇచ్చే బియ్యం మీకు అవసరం లేదా అని ప్రశ్నించారు.








