రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదు : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..సీఎం రేవంత్ రెడ్డి
భారత స్వాతంత్ర్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయులు, జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఘన నివాళి.
పేదవాడికి ఆకలి నుంచి విముక్తి… రైతుకు అప్పుల నుంచి విముక్తి… మహిళకు ఆర్థిక స్వేచ్ఛ… యువతకు ఉపాధి… బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే స్వాతంత్ర్యానికి నిజమైన అర్థం.
మహాత్మాగాంధీ, స్వాతంత్ర్య సమరయోధులు చూపిన మార్గం… స్వాతంత్ర్యం తర్వాత వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, విజ్ఞానం, సాంకేతిక రంగాలకు వేసిన పునాదుల స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.
సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యాలుగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టి 32 నెలలు పూర్తయింది.
దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టిన మా ప్రభుత్వం సంక్షేమాన్ని విస్తరించింది. అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించింది.
తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన విధానాలు, చట్టాలు, భారీ ప్రాజెక్టులు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు బలమైన పునాదులు వేసింది.
రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే కార్యక్రమాలు తలపెట్టింది.
తెలంగాణ పునర్నిర్మాణానికి కొత్త బాటలు వేసింది. అన్ని రంగాల అభివృద్ధి… అన్ని వర్గాల సంక్షేమం… భవిష్యత్తు తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే సరికొత్త ప్రజాపాలన ముద్ర.
తెలంగాణ ఆర్థిక ప్రగతి
32 నెలల ప్రజాపాలన ఫలితాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు 91 శాతం అధికం.
రైతు బాగుంటేనే మనం బాగుంటామని ప్రభుత్వం భావిస్తోంది.. రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం..
రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ. 25 లక్షల కుటుంబాలకు రుణభారం నుంచి విముక్తి.
మన రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. వరి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించి దేశంలో నంబర్–1గా నిలిచారు.
యాసంగిలో 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి కొత్త రికార్డు సృష్టించాం..
రైతు భరోసా కింద రూ.36 వేల కోట్ల పెట్టుబడి సాయం. 9 రోజుల్లో 9 వేల కోట్లు.
సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి అండగా నిలబడ్డాం..
32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.70 లక్షల కోట్లు.
కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటాలో రాజీ పడేది లేదు..
చివరి బొట్టు వరకు సాధిస్తాం..
తుమ్మిడి హట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం..
వ్యవసాయం దండుగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూసేలా పనిచేస్తున్ఆనం..
మహిళా సాధికారతలో తెలంగాణ దేశానికే చిరునామా.
కోటీ మంది మహిళలకు కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం..
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం. 335 కోట్ల జీరో టికెట్లు.
34 లక్షల మంది మహిళలు ప్రతి రోజు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్నారు..
మహిళలకు దాదాపు రూ.11 వేల కోట్ల మేర ఆదా.
గృహజ్యోతి కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు.
43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్.
1.68 లక్షల మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా 4,709 కోట్లు అందించాం..
మహిళా సంఘాలకు రూ.60,487 కోట్ల రుణాలు. రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ.
స్వయం సహాయ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేశాం..
యూనిఫాంలు, చీరల తయారీ నుంచి పెట్రోలు బంకులు, ఆర్టీసీ బస్సుల యాజమాన్యం వరకు మహిళా సంఘాల వ్యాపార విస్తరణ.
తెలంగాణ మహిళలు దేశంలోనే పారిశ్రామిక వేత్తలు గా మారాలన్నది మా ప్రభుత్వం ఆకాంక్ష..
అన్ని రంగాల్లో వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్న మహిళలకు ప్రత్యేక అభినందనలు.
ఆహార భద్రత – ఇందిరమ్మ ఇండ్లు
ఎన్నో యేళ్లు రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారు..
మేం 15 లక్షలకుపైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశాం..
3.38 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార భద్రత.
రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తున్నాం.
కొత్త సాంకేతికతతో రేషన్ పంపిణీలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతున్నాం.
రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకం అమలు చేశాం. ఇది దేశానికి కొత్త నమూనా.
ఇదో విప్లవాత్మక పథకం..
ఇందిరమ్మ ఇళ్లు అంటే పేదల ఆత్మగౌరవ ఆనవాళ్లు ..
మాకు సొంత ఇళ్లు ఉందని చెప్పుకునే భరోసా ప్రజా ప్రభుత్వం కల్పిస్తోంది..
పేదల ఆత్మగౌరవం నిలబెట్టేలా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం..
తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సహాయం అందిస్తున్నాం..
గిరిజనులు, చంచులు, వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం.
2.50 లక్షల ఇళ్లను రెండో విడతలో ఇస్తున్నాం..
హైదరాబాద్‌లో క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల టవర్లను నిర్మిస్తున్నాం.
రాష్ట్రంలో వృద్ధులు, వితంతులు, వికలాంగులు, చేనేత కార్మికులు 43 లక్షల మంది పింఛన్లు ఇస్తున్నాం..
. కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నాం..
అర్హులైన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు కొత్త గా పింఛన్లు మంజూరు చేస్తాం..
వితంతువులు, ఒంటరి మహిళలందరికి పింఛన్లు ఇస్తాం..
సామాజిక న్యాయానికి ప్రజా ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుంది..
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించాం..
దేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ..
బ్రిటిష్ హయాంలో కులగణన జరిగింది. తర్వాత 100 యేళ్లలో ఎవరూ కులగణన చేయలేదు..
తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా కులగణన చేసి కేంద్రానికి ఆదర్శంగా నిలబడింది..
దేశంలోనే ఈ విషయంలో తెలంగాణ గర్వంగా నిలబడింది..
కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన చేయాలని భావించడం వెనుక తెలంగాణ ఉంది..
బీసీలకు రాజకీయాలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లుల ఆమోదించి కేంద్రానికి పంపించాం..
అన్ని వర్గాలకు న్యాయమైన అవకాశాలు కల్పించడానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది..
12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణ. కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం.
గిగ్ కార్మికులకు చట్టబద్ధ గుర్తింపు, సంక్షేమ బోర్డు, సామాజిక భద్రతకు ప్రత్యేక చట్టం.
వృద్ధ తల్లిదండ్రులు నిరాదరణకు గురవకుండా సంరక్షించే ప్రత్యేక చట్టం.
విద్య
• పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు సంస్కరణలు.
• కేంద్ర ప్రభుత్వం పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి పురోగతి.
• ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. 105 స్కూళ్ల మంజూరు.
ఇప్పటికే 84 స్కూల్స్ కు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించుకున్నాం..
ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నాం..
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు.
• ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు 22 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషకాహారం.
• ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలు 212 శాతం పెంపు.
బడుగు బలహీన మైనార్టీ దళిత పిల్లలు ఆత్మగౌరవంతో బతకడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం.
11 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట ఇవ్వడం ద్వారా వారికి అండగా నిలుస్తున్నాం..
• విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్. యాజమాన్యాలతో సంబంధం లేకుండా ప్రతి విద్యా సంవత్సరం నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ.
ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు
• ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్ల కేటాయింపు.
సర్టిఫికెట్ ఉంటే సరిపోతు.. దానితో పాటు సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి..
• తొలి రెండేండ్లలోనే 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం..
నోటీఫికేషన్ ఇచ్చి ఆగిపోవడం పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చేంత వరకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసింది..
టీజీపీఎస్సీ ని ప్రక్షాళన చేసి పారదర్శకంగా పునరుద్దరించాం..
• టీజీపీఎస్సీ ద్వారా 456 పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,437 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్లు
ఇచ్చాం..
పోటీ పరీక్షలు నిరుద్యోగులు సిద్ధం కావాలి.. ఇతర వ్యాపాకాల్లోకి పోవద్దు..
యువతతో విద్యతో పాటు నైపుణ్యం, ఉద్యోగం కల్పించడం కోసం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 1,190 మంది శిక్షణ. 838 మందికి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు..
జాబ్ మేళాలో 5700 మంది ఉద్యోగాలు సాధించారు..
ఆడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా 65 ఐటీఐల ఆధునీకరించాం.
త్వరలో 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా చేస్తున్నాం.
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం..
యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ను ఏర్పాటు చేశాం..
మట్టి మాణిక్యాలను వెలికి తీయడానికి సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించాం..
త్వరలో ఖేలో ఇండియా 2026 ను నిర్వహించబోతున్నాం..
ఉద్యోగాలు సాధించిన యువత, తెలంగాణకు పతకాలు తెస్తున్న క్రీడాకారులు, కోచ్‌లకు ప్రత్యేక అభినందనలు.
వైద్యం మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశం..
రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం..
ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది..
గోషామహల్లో రూ.2,700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం.
వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో మూడు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాం..
త్వరలో సనత్ నగర్ టిమ్స్ ను ప్రారంభించుకోబోతున్నాం..
తొమ్మిది కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం..మరో 8 మెడికల్ కాలేజీల నిర్మాణం చేస్తున్నాం..
నిమ్స్ లో 2,000 కిడ్నీ మార్పిడి సర్జరీలు నిర్వహించారు.. ఇందులో 1900 మంది రోగులకు ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ ఎఫ్ ద్వారా సాయం అందించాం..
ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5 లక్షల18 వేల మందికి రూ.2,526 కోట్ల సాయం.
తల్లిదండ్రులను పట్టిపీడీస్తున్న సమస్య డ్రగ్స్, అహార కల్తీ
కల్తీ ఆహారం వల్ల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
డ్రగ్స్ ముప్పు, ఆహార కల్తీని ఎదుర్కొనేందుకు కొత్తగా టీజీ సేఫ్ ఏర్పాటు చేశాం..
డ్రగ్స్, ఆహార కల్తీ ఏ మాత్రం జరిగినా ప్రభుత్వం చూస్తు ఉర్కోదు.. కఠినంగా వ్యవహారిస్తాం..
ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణను ఒకే వ్యవస్థ కిందకు తీసుకువచ్చి ప్రత్యేక లీగల్, ల్యాబొరేటరీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు.
విస్తృత తనిఖీలు, దాడులు నిర్వహిస్తారు..
తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..
పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరించి.. హైవేలు, ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు తగ్గించేందుకు కొత్తగా టీజీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో.
• ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టకుండా, పన్నులు–రుసుముల ఎగవేతను అరికట్టేందుకు విజిలెన్స్, పౌరసరఫరాల శాఖల్లో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ఏర్పాటు.
• సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక పోలీసింగ్. షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు.
భరోసా ప్రాజెక్టు ద్వారా బాలల అనుకూల న్యాయస్థానాల ఏర్పాటులో తెలంగాణ దేశంలో తొలి అడుగు.
శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబాలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతినెలా ఫస్ట్ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నాం..
కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాల చెల్లింపు చేస్తున్నాం..
పేరుకుపోయిన రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లించాం..
వంద రోజుల్లో రూ.6000 కోట్ల బకాయిల కింద చెల్లించాం..
ఇతర బకాయిలను సరైన సమయంలో అందిస్తామని మాట ఇస్తున్నాం..
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతూ సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేస్తున్న ఉద్యోగులు, అధికారులకు ప్రత్యేక అభినందనలు.
డిజిటల్ పాలనలో తెలంగాణనే ఆదర్శం..
36 శాఖల్లో 100 శాతం ఈ-ఆఫీస్ అమలు చేశాం..
దేశంలోనే తొలి పూర్తిస్థాయి డిజిటల్ కేబినెట్ నిర్వహించాం..
వాట్సాప్‌లో 581కిపైగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం..
ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి.
ప్రతి సోమవారం ప్రజా వాణి
త్వరలో ఆన్లైన్ ప్రజావాణి పోర్టల్. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం.
ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణలో అభివృద్ధి పనులు.
మన పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో ..
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నాం..
హైదరాబాద్ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నాం..
రాష్ట్రవ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లు నిర్మిస్తున్నాం..
హైదరాబాద్ మెట్రో రెండో దశలో ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల విస్తరిస్తున్నాం..
వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్పోర్ట్ ను పునరుద్దరిస్తున్నాం..
ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధి చేస్తున్నాం.
చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కాపాడటం కోసం హైడ్రాను ఏర్పాటు చేశాం..
యమునా, గంగా, సబర్మతి రివర్ ఫ్రెంట్ గురించి మనం చర్చించుకుంటున్నాం..
మూసీ పునరుజ్జీవన పథకంలో 55 కిలోమీటర్ల సమగ్ర అభివృద్ధి చేస్తున్నాం.. 39 కొత్త ఎస్టీపీలు నిర్మిస్తున్నాం..
గోదావరి నుంచి 2.5 టీఎంసీల స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించే ప్రణాళిక తో ముందుకు వెళ్తున్నాం..
మూసీలో మురిక కూపంగా మారింది.. అత్యంత కాలుష్య నది గా నోటిఫై చేశారు..
ప్రభుత్వం క్రమ బద్దంగా, సమన్వయంగా మూసీ ప్రక్షాళన చేస్తున్నాం..
మూసీ నిర్వాసితులు ప్రభుత్వానికి సహకరించాలి..
నిర్వహిసితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది..
మూసీ ప్రక్షాళన తోనే హైదరాబాద్ ముందుకు వెళ్తుంది..
ఈ విషయంలో అందరి సహకారాన్ని ప్రభుత్వం ఆశిస్తుంది..
దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమలకు పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ మారింది..
బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్‌లో కీలక రంగాల్లో తెలంగాణ టాప్ అచీవర్ గా నిలబడింది..
తెలంగాణ ఇన్వెస్ట్ ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించాం..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో రూ.5 లక్షల75 వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నాం..
త్వరలోనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తాం.
ఇన్వెస్ట్ తెలంగాణ గా ప్రపంచానికి చాటు చెపుతాం
నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ తీసుకువచ్చాం..
3 లక్షల 50 వేల ఉద్యోగ అవకాశాల లక్ష్యం పెట్టుకున్నాం..
ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలు హైదరాబాద్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి..
ప్రపంచస్థాయి టెక్నాలజీ కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
2025-26లో ఐటీ ఎగుమతులు రూ.3 లక్షల 97 వేల కోట్లు గా ఉన్నాయి..
12.14 లక్షల ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్నాం..
హైదరాబాద్‌లో 355కిపైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు.
2026 లో కొత్తగా 40 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల వచ్చాయి..
హైదరాబాద్‌ను ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌లో నిలబెడుతున్న ఐటీ ఉద్యోగులు, స్టార్టప్‌లు, యువ నిపుణులు, అంతర్జాతీయ సంస్థలకు అభినందనలు.
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పడానికి పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతున్నాం..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి టూరిజం పాలసీ–2025 తీసుకువచ్చాం..
ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నాం..
తొలి ఏడాదిలోనే రూ.23 వేల కోట్ల పెట్టుబడులు సాధించాం..
యువ టూరిజం క్లబ్‌ల ఏర్పాటులో తెలంగాణ దేశంలో నంబర్–1.
లాభాల బాట పట్టిన తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్.
భవిష్యత్తు తెలంగాణ
గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు కేటాయించాం.. కుంభమేళా స్థాయిలో పుష్కరాలు నిర్వహిస్తాం..
ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించాం.. భవిష్యత్తు పెట్టుబడులకు మౌలిక సదుపాయలు కల్పించాం..
32 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయంతో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తున్నాం..
తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో ప్రపంచంతో పోటీపడే భవిష్యత్తు తెలంగాణకు ప్రణాళికలు వేస్తున్నాం..
2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్.. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలబట్టడమే లక్ష్యం.
దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పం.
ఇందులో అందరి సహకారం కావాలి..
క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి వలయాలతో హైదరాబాద్ నుంచి గ్రామీణ తెలంగాణ వరకు సమగ్ర అభివృద్ధి.
భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం.
• విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రారంభమైన ప్రయాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లి తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా, ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టడమే సంకల్పం.
నెట్ జీరో స్మార్ట్ సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతాం..
30 వేల ఎకరాల్లో ప్రపంచ స్థాయి గొప్ప నగరం భారత ఫ్యూచర్ సిటీ ని నిర్మిస్తున్నాం..
ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ఫ్యూచర్ సిటీ కాబోతుంది..
ఫ్యూచర్ సిటీకి భూములు అందించిన రైతులకు అభినందలు..వారికి సరైన పరిహారం అందించి ఆదుకుంటాం.
ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రతి విజయంలో ప్రజల భాగస్వామ్యం. వారి విశ్వాసం, సహకారం, ఓర్పు, కష్టానికి ప్రభుత్వం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం..
ఉద్యోగ మిత్రులు సంపూర్ణ సహకారాన్ని అందించి ఆదాయాన్ని పెంచాలి..
అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా ముందుకు నడిపిస్తాను..








