ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ : పవన్ కల్యాణ్
కాకినాడ (Kakinada) పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పాల్గొని జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక తరం స్వాతంత్య్రం కోసం పోరాడితే ఒక తరం స్వాతంత్య్రాన్ని కాపాడిందన్నారు. బలమైన, సమర్థ దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందన్నారు. వికసిత్ భారత్ (India) సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తనదైన పాత్ర పోషిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.








