‘ది ఇండియన్ బార్డర్’ మంచి విజయం సాధించాలి.. ‘జిందా రహేన్ తో డ్యూటీ’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో మేజర్ ఎస్పీఎస్ ఒబేరాయ్
ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద నివేద్య రెడ్డి నిర్మాణంలో డి.ఎస్. బాషా దర్శకత్వం వహించిన చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. ఈ సినిమాలో కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ, సిందు తులాని ముఖ్య పాత్రలను పోషించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ దేశ భక్తి గీతాన్ని విడుదల చేశారు.
‘జిందా రహేన్ తో డ్యూటీ’ అంటూ సాగే ఈ పాట అడ్రినల్ రష్‌లా ఉంది. గూస్ బంప్స్ ఇచ్చేలా, నరనరాల్లో దేశభక్తిని రగిల్చేలా ఈ పాట సాగింది. ఇక ఈ పాటకు ఆనంద్ మంత్ర బాణీ, డి.ఎస్. బాషా సాహిత్యం, శరవణ గాత్రం దేశ భక్తి గీతంగా మార్చేసింది. జవాన్ల త్యాగాల్ని, ధైర్య సాహసాల్ని గుర్తు చేసేలా ఈ పాట సాగింది. కె మ్యూజిక్ ఈ మూవీ ఆడియో రైట్స్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో
మేజర్ ఎస్పీఎస్ ఒబేరాయ్ మాట్లాడుతూ .. ‘‘దేశం గురించి, సైన్యం గురించి సినిమా తీయడం ఆనందంగా ఉంది. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయటి ఆహారాన్ని తినొద్దు. నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధించాలి’ అని అన్నారు.
హీరో, రైటర్ కిరణ్ యార్లగడ్డ మాట్లాడుతూ .. ‘‘ది ఇండియన్ బార్డర్’ ఈవెంట్ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. పాలస్తీనా వార్ టైంలో ఈ కథ నాలో పుట్టింది. డి.ఎస్.బాషా గారు ఈ కథకు ఓ స్వరూపాన్ని తీసుకు వచ్చారు. ఎక్స్ ఆర్మీ పర్సన్స్, మీడియా మాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. సైనికుడు చేసే త్యాగం, సైనికుడి భార్య చేసే త్యాగాల్ని ఇందులో చూపించాం. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు డి.ఎస్. బాషా మాట్లాడుతూ .. ‘‘ది ఇండియన్ బార్డర్’ ఈవెంట్‌కి వచ్చిన ఆర్మీ అధికారులు, మీడియా వారికి థాంక్స్. సైనికుడి త్యాగం, ఆలోచనలు, గొప్పదనం చెప్పేలా ఈ సినిమా ఉంటుంది. అందుకే ఈ పాటను కూడా సైనికుడికి అంకితం చేసేలా తీశాం. మనం ఈ రోజు ఇక్కడ ఇలా సంతోషంగా ఉన్నామంటే.. దానికి కారణం అక్కడ సైనికుడు చేసే త్యాగమే. కిరణ్ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇంత మంచి కథ, సినిమాలో భాగం అవ్వడం నాకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.
నిర్మాత నివేద్య రెడ్డి మాట్లాడుతూ .. ‘‘ది ఇండియన్ బార్డర్’ ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరూ కలిసి ఓ ఫ్యామిలీలా కష్టపడ్డాం. నా తండ్రి కూడా సైనికుడే. ఈ చిత్రంతో మానవ సంబంధాలు, ఎమోషన్స్‌ని చూపించాలని అనుకున్నాం. సైనికులకు అంకితమిచ్చేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాం గోపాల్ చౌదరి మాట్లాడుతూ .. ‘‘కిరణ్ నాకు ఓ మంచి కథను చెప్పారు. దేశ భక్తి మీద చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. కిరణ్ అందరికీ సహాయం చేస్తుంటాడు. అందుకే నేను కిరణ్‌కి, నివేద్య గారికి నా వంతుగా సాయం చేశాను’ అని అన్నారు.
కొరియోగ్రాఫర్ రమేష్ మాస్టర్ మాట్లాడుతూ .. ‘‘జిందా రహేన్ తో డ్యూటీ’ పాట చాలా బాగా వచ్చింది. అందరూ ఎంతో ఎనర్జీగా డ్యాన్స్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ మంత్ర మాట్లాడుతూ .. ‘‘ది ఇండియన్ బార్డర్’ కథ అద్భుతంగా ఉంటుంది. ఆర్ఆర్ చేస్తున్నా. చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. గొప్ప మెసెజ్ ఉంటుంది. అందరూ ఈ మూవీని యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ఈ మూవీకి నలినికాంత్ కొండపల్లి కెమెరామెన్‌గా, కె. రమేష్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. హర్నాథ్ సింగులూరి, గౌరి శంకర్ నడిపల్లి పాటలకు సాహిత్యాన్ని అందిస్తున్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించిన ఇతర అప్డేట్లను ప్రకటించనున్నారు.








