ఏప్రిల్ 19న నాట్స్ పిట్స్బర్గ్ ఆధ్వర్యంలో.. ఉచిత సిపిఆర్ (CPR) శిక్షణ
NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) పిట్స్బర్గ్ విభాగం, శిరిడీ సాయి గానుగ మందిర్ (USA) సహకారంతో ఉచిత సిపిఆర్ (CPR) శిక్షణా కార్యక్రమాన్ని సమాజ శ్రేయస్సు కోసం నిర్వహిస్తోంది. “ఒక ప్రాణాన్ని కాపాడండి – మన సమాజాన్ని బలోపేతం చేయండి” అనే నినాదంతో ఈ కార్యక్రమం ఏప్రిల్ 19, 2026 ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది.
ముఖ్య వక్త , శిక్షకులు..
బేసిక్ లైఫ్ సపోర్ట్ , సిపిఆర్ నిపుణుడు నెహాంత్ దిరిసాల (Nehanth Dirisala) ఈ శిక్షణా కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించి, అత్యవసర సమయాల్లో ప్రాణాలను ఎలా కాపాడాలో ప్రత్యక్షంగా వివరించనున్నారు.
నిర్వాహక బృందం:
NATS చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి మార్గదర్శకత్వంలో పిట్స్బర్గ్ టీమ్ ఈ ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు.
BOD & EC: అనుదీప్ అర్ల (ZVP), రవి తుమ్మల (Web Secretary).
పిట్స్బర్గ్ టీమ్: రవి కొండపి (కోఆర్డినేటర్), శిల్పా బోయిన (జాయింట్ కోఆర్డినేటర్), రంజనేయులు గొల్ల (సెక్రటరీ), శ్రీహర్ష కలగర (ట్రెజరర్), మనోజ్ టాటా (స్పోర్ట్స్ కోఆర్డినేటర్), గిరీష్ (స్పోర్ట్స్ కో-ఛైర్), నెహాంత్ దిరిసాల (యూత్ కోఆర్డినేటర్), రాణా పార్చురి (యూత్ కో-ఛైర్), ప్రియా బావినేని (ఉమెన్ వింగ్ & కల్చరల్ కోఆర్డినేటర్).
పిట్స్బర్గ్ అడ్వైజరీ టీమ్: హేమంత్ KS, అర్చన కొండపి, సాయి అక్కినేని, వెంకట్ దిరిసాల, లీలా అరిమిల్లి.
వేదిక , రిజిస్ట్రేషన్..
ఈ కార్యక్రమం 6000 Middlefield Dr, McDonald, PA 15057 చిరునామాలో నిర్వహింనున్నారు. ఆసక్తి గల వారు ఏప్రిల్ 19లోపు https://natsworld.org/pittsburghcpr లింక్ ద్వారా లేదా పోస్టర్‌లోని QR కోడ్ స్కాన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.








