హ్యూస్టన్ టిసిఎ స్వర్ణోత్సవ వేడుకలు…ముచ్చట్లు
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి గోల్డెన్ జూబ్లి సంబరాలను పురస్కరించుకుని మాజీ అధ్యక్షుడు, తెలుగు ప్రముఖుడు వంగూరి చిట్టెన్ రాజు ఇంట్లో తక్కువ టైంలో ఏర్పాటు చేసిన కిక్ ఆఫ్ మీటింగు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ వేడుకల గురించి ఆయన మాటల్లోనే…. మొత్తం 75 మంది వచ్చారు. అందరికీ హోం మేడ్ ఫుడ్ అందించాము. నాతో పాటు దేవి, పద్మజ, సుభద్ర, భ్రమరా, అనిలజ, వల్లి, ఉమా మంత్రవాది, ప్రసాద్ నాకు హెల్ప్ చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. TCA కోసం చేసిన కిక్ ఆఫ్ మీటింగుకు వచ్చి సహకరించిన దాతలు అందరికీ కృతజ్ఞతలు. నేను చేసిన ప్రతి పనికి నా మీద నమ్మకంతో చేదోడు వాదోడుగా హెల్ప్ చేస్తూ ఎప్పుడు డొనేషన్స్ అడిగినా ఇచ్చిన దాతలు అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. మొత్తం 45,000 డాలర్స్ విరాళాలుగా ఇచ్చేందుకు రాత్రి కమిట్మెంట్లు రావడం సంతోషకరం. ఇంకొక 5,000 డాలర్లు దారిలో ఉన్నాయి. మొత్తం 50,000 డాలర్లు. మరికొంతమంది డోనర్స్… బడ్జెట్ను చూసి ఖర్చు పెట్టే విధానాన్ని చూసి ఇస్తామని కమిట్ అయ్యారు.
చాలా సరదాగా జరిగిన కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉమా మంత్రవాది పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణ. రాత్రి జరిగిన మీటింగులో కొన్ని ఫోటోలు నాకు ఇప్పుడే కొంతమంది ఫ్రెండ్స్ పంపారు. అవి ఇక్కడ పంచుకుంటున్నాను. ఎంజాయ్ చేయండి. ఇలాగే మనం సరదాగా ఎన్నో ఫంక్షన్స్ చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను….
వంగూరి చిట్టెన్ రాజు…
హ్యూస్టన్
ఇవి కూడా చదవండి








