ఆటా 19వ మహాసభల సాహితీ సంబరం.. నవలల పోటీ ఎంట్రీలకు జూన్ 30 వరకు అవకాశం!
ATA: అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు అత్యంత వైభవంగా జరగనున్న 19వ ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ సందర్భంగా ‘ఆటా సాహిత్య విభాగం’ నవలల పోటీని నిర్వహిస్తున్నారు. తెలుగు సాహిత్యంపై మక్కువ ఉన్న రచయితలను ప్రోత్సహించేందుకు ఈ పోటీని ఏర్పాటు చేశారు. విజేతలకు మొత్తం 2 లక్షల రూపాయల విలువైన బహుమతులను అందజేయనున్నారు.
పోటీ నిబంధనలు:
- ప్రపంచంలోని ఏ ప్రాంతపు నవల నేపథ్యమైనా కావచ్చు, కానీ అది తెలుగువారి జీవితానికి సంబంధించినదై ఉండాలి.
- నవల అచ్చులో కనీసం 150 పేజీలైనా ఉండాలి.
- ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా ఈ పోటీకి నవలలు పంపవచ్చు.
- డీటీపీ చేసిన కాపీలను లేదా స్పష్టంగా స్కాన్ చేసిన కాపీలను ata.abeditor@gmail.com కు ఈమెయిల్ చేయాలి.
- నవలలు తమ స్వంతమని, అనువాదాలు లేదా అనుకరణలు కావని, గతంలో ఎక్కడా ప్రచురితం కాలేదని రచయితలు హామీ పత్రం జతచేయాలి.
- నవల ప్రతి మీద రచయిత పేరు ఉండకూడదు. పేరు, చిరునామా, ఫోన్ నంబరు వంటి వివరాలను ఈమెయిల్లో విడిగా రాయాలి.
- నవలల ఎంపికలో ఆటా నిర్వాహకులదే తుది నిర్ణయం. దీనిపై ఎటువంటి వాదోపవాదాలకు తావులేదు.
- బహుమతి పొందిన నవలలను ప్రచురించే హక్కు ఆటా (ATA) కు ఉంటుంది.
- నవలలు అందవలసిన ఆఖరి తేదీ జూన్ 30, 2026.
సాహిత్య కమిటీ: వేణు నక్షత్రం (చైర్మన్), సూర్య నంపల్లి, రాజ్‌కుమార్ (కో-చైర్స్), జయదేవ్ మెట్టుపల్లి, ప్రకాష్ తిమ్మాపురం, రాజేశ్వర్ రావు టేక్మల్ (సలహాదారులు).
కాన్ఫరెన్స్ కోర్ కమిటీ: జయంత చల్లా (ప్రెసిడెంట్), శ్రీధర్ బానల (కన్వీనర్), రవి చల్లా (కోఆర్డినేటర్), శరత్ వేముల (నేషనల్ కోఆర్డినేటర్), సుధీర్ దమిడి (డైరెక్టర్).
ఇతర సభ్యులు: జీనత్ కుందూర్, అరవింద్ ముప్పిడి, కౌశిక్ సామ, తిరుమల్ రెడ్డి మునుకుంట్ల, కిరణ్ అల.
మరింత సమాచారం కోసం www.ataconference.org లేదా www.americanteluguassociation.org వెబ్సైట్లను సందర్శించగలరు.








